పాకిస్తాన్ లో ఈ రోజు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 65 మంది చనిపోయారు.
తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో రైలు లో మంట లు వ్యాపించాయి. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ రావల్పిండినుంచి కరాచివెళ్తున్నపుడు లియాఖత్ పూర్ వద్ద రైలులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
మూడు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో గాయపడిన (40) వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వ్యాపిస్తున్న మంటలనుంచి కాపాడుకునేందుకు చాలా మంది రైల్లో నుంచి దూకారు.
చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇలా దూకిన వారే. వారి రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది సిలిండర్ ఉపయోగించి వంట చేసుకుంటున్నారని, దానికి తోడు వారిదగ్గిర వంటనూనే కూడ ఉండటంతో ప్రమాదం తీవ్రమయిందని రైల్వేమంత్రి షేక్ రషీద్ తెలిపారు.