ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయాలు రంగులు మార్చుకుంటున్నాయి. అక్కడి గోడల మీద ఉన్న త్రివర్ణ పతకాల రంగలు వైసిపి జండా రంగులకు మారుతున్నది. జాతీయ పతాకాన్ని చెరిపేయడం సోషల్ మీడియా లో చర్చనీయాంశమయింది. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని తమిడే పల్లిలో గ్రామసచివాలయానికి ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించి అధికార పార్టీ రంగులద్దుతున్నవీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
ఇంకే ముంది ఇది తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ లోకేష్ కంట పడింది. ఆయన ట్విట్టరెక్కి ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరిచారు.
ఆగస్టు 30 పంచాయతీ రాజ్ కార్యదర్శి గిరిజా శంకర్ ఉత్తర్వుల మేరకే ఇలా చేస్తున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, గ్రామసచివాలయాలన్నింటికి వైసిపి రంగులేసి, లోపలు ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెట్టాలి.
ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే, గవర్నమెంట్ కార్యాలయాలకు పార్టీ రంగులేమిటనిఅంతా ప్రశ్నిస్తున్నారు.
Forget changing names or colours of @ncbn’s schemes / projects, @ysjagan’s Govt is now replacing Indian Tricolours (on Govt buildings) with YSR Congress party colours. What next? Replacing our national anthem and Telugu Talli song with Party Songs? Downright disgusting!! pic.twitter.com/AUVtp9omJt
— Lokesh Nara (@naralokesh) October 29, 2019