వైసిపి నేతల ఇసుక స్వార్ధానికి రోజూ బేల్ దారీ కూలీలు బలి అవుతున్నారని లక్షలాది కార్మికుల జీవనోపాధిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ధ్వజం మెత్తారు.
సొంతూళ్లో ఉన్న వాగుల్లో నుంచి కూడా ఇసుక తెచ్చుకోడానికి అనేక అడ్డంకులు కలిగిస్తున్నారని, 10రెట్ల ఎక్కువ ధరలకు వైసిపి నేతలు ఇసుక విక్రయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ రోజు ఆయన తెలుగుదేశం రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
’ఆన్ లైన్ లో ఇసుక అమ్మకాలు అనేది జగన్మాయగా మారిందని అరగంటలోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు,’ అని విమర్శించారు.
ఇలాగే వైసిపి ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని చెబుతూ చింతమనేని ప్రభాకర్, అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏంజరుగుతున్నదో తెలియని అయోమయం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ విశేషాలు:
రాష్ట్రంలో ఇసుక సంక్షోభం జగన్ ప్రభుత్వం తప్పిదే. మానవ తప్పిదమే,
చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి.
మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యే దుస్తితి తెచ్చారు.
రాజధానిపై ఇంకో కమిటి వేశారు, దానికి సూచనలు ఇవ్వాలట..
గోదావరి-కృష్ణా అనుసందానాన్ని రివర్స్ చేస్తున్నారు జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదం