హైదరాబాద్ లో పావురాలొద్దంటున్న జిహెచ్ ఎంసి

హైదరాబాద్ మొజాం జాహి మార్కెట్ జిహెచ్ ఎంసి  సుందరంతా తీర్చిదిద్దుతూఉంది. అయితే, అక్కడ పావురాలు బెడద ఎక్కువగా ఉంద చెప్పి వాటిని పట్టుకుని అడవుల్లో వదిలి పెడుతున్నారు.

ఈ రోజు 500 పావురాలను పట్టకుని శ్రీశైలం అడవుల్లో వదలిపెట్టారు. అయితే, పావురాలకు వున్న గ్రాహక శక్తి వల్ల మళ్లీ మొజాం జాహి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది.

పావురం (Rock Pigeon: Columba Livia) మనిషికి చేరువై దాదాపు 5000 సంవత్సరాలయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పావురం ఉనికి మొదట దక్షిణాసియాలోనే కనిపించింది. మెసపుటేమియా లో దొరికిన శిల్పాలలో పావురాల బొమ్మలున్నాయి. అట్లాగే ఈజిప్టు చిత్రలిపి(heiroglyphics) లో పావురాలకు చోటు దక్కిందంటే అవి మానవ సమాజానికి ఎంత దగ్గరగా ఉండేవో అర్థమవుతుంది.

మనిషికి పావురం చేసిన సేవ అంతా ఇంతగాదు. ఒకపుడు పావురమే మనిషి రాయబారి. అక్బర్ చక్రవరి ఎపుడూ పావురాలను వెంటబెట్టుకునే ప్రయాణం చేసేవాడని చెబుతారు.  కొన్నిప్ర భుత్వ శాఖల వారు ఇటీవలి దాకా కొన్ని సుదూర ప్రాంతాలకు సమాచారం పంపేందుకు పావురాలను వాడేవారని చదివాం.అందుకే మనుషుల మధ్య ఏ మాత్రం భయం లేకుండా పావురాలు తిరుగుతూ ఉంటాయి.

అయితే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్ ఎంసీ అధికారులు చెపుతున్నారు.

వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి మేత వేయొద్దని సూచిస్తున్నారు.

పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని చెపుతున్నారు. అయితే, మానవ సమాజానికి, జనావాసాలకు దూరంగా పావురాలు ఉండగలా? పర్యావరణ నిపుణులెవరైనా చెప్పాలి.