ఆర్టీసీ కి డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన కెసిఆర్, ఆర్టీసి వర్కర్స్ చేస్తున్నది క్రైం…

అనుకున్నట్లుగా హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్  ఆర్టీసి  భవిష్యత్తు గురించి తన మనసులో మాట చెప్పారు. ఆర్టీసి కథ ముగిసిందని చెప్పేశారు.

హుజూర్నగర్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలవడం కాదు, అఖండ విజయం సాధించడంతో ఆయన తన నిర్ణయాలకు కొంత అర్థం, సొంత అర్థం చెప్పేందుకు అవకాశమొచ్చింది. ఆయనకుపట్ట పగ్గాలుండవు. అన్ని అడ్డంకులు ఆయన అధిగమిస్తారు.

ఇక ఆర్టీ సి సమ్మె ఏ రూపం తీసుకోబోతుందో చెప్పడం కష్టం.సాధ్యమయినంతవరకు సమ్మె ముగియవచ్చు.

ఏవరో కేశవ రావు లాంటి  పెద్ద మనిషి మధ్య వర్తిత్తం లేదా కోర్టు జోక్యంతో చర్చలు జరగవచ్చు.

ఆర్టీ సికార్మికులు దిగివచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. తెలంగాణలో వోటర్లను నమ్ముకుని ఎవరూ కెసిఆర్ తో తగవుపెట్టుకోకుండా హుజూర్నగర్ ప్రజలు తీర్పించారు. 

ఈ తీర్పు ప్రతిపక్షాలకు చావు దెబ్బే. కెసిఆర్ కు ఇక తిరుగు లేదు.

ఇది ఎంతకాలం సాగుతందో చెప్పలేం. ఈ రోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో ఆర్టీసి గురించి ఏమన్నారో చూడండి.

ఆర్టీసీకి 5వేల కోట్ల అప్పులు ఉన్నాయి
12వందల కోట్ల నష్టం ఏడాదికి ఆర్టీసీ నడుస్తుంది
ఆర్టిసిలోనే అద్దె బస్సులు లాభాల్లో నడుస్తున్నాయి..ఆర్టీసీ బస్సులు మాత్రం నష్టాల్లో ఉన్నాయి
*8వేల ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి కిలోమీటర్ కి 13 రూపాయల నష్టం వస్తుంది ఎలా?
ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కాళ్ళు వాళ్ళే నరుకుంటున్నారు
టీఆరెస్ కంటే ముందు ప్రభుత్వ 7వందల కోట్లు ఇస్తే..ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం 4వేల కోట్లకు పైగా విడుదల చేసింది
ఏడాదికి 9వందల కోట్లకు పైగా ఆర్టీసీకి నిధులు ప్రభుత్వం ఇస్తుంది
ప్రభుత్వం వేసిన కమిటీని కాదని కార్మికులు సమ్మెకు వెళ్లాయి
ఆర్టీసీ యూనియన్ల పేరుతో క్రైమ్ చేస్తున్నారు
ఈ ప్రపంచంలో ఆర్టీసీని ఎవ్వరూ కాపడలేరు

మోడీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటు తరువాత చట్టం తెచ్చింది
ఈ చట్టంలో చాలా స్పష్టంగా అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది
హైకోర్టు కూడా ఆర్టీసీ పై తీర్పు చెప్పే అధికారాలు లేవు
ఆర్టీసీ కార్మికుల పై ఎస్మా ఉంది

 ‘ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా . తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇది.  యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవి. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదు, ఇక ఆర్టీసీనే ముగుస్తుంది. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. అంతా అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసింది.’