ఇంతవరకు బారిస్టర్ అసదుద్దీన్ నాయకత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లీమీన్ (AIMIM)కు హైదరాబాద్ ఓల్డ్ సిటీ పార్టీ అనే పేరుండింది.
ఎందుకంటే, ఆ పార్టీ తెలంగాణాలో గాని, ఆంధ్రలో గాని విస్తరించలేకపోయింది. అవెే ఎమ్మెల్యే సీట్లు, అదే హైదరాబాద్ లోక్ సభ సీటు.
అయితే, ఈపరిస్థితి మారిపోతుఉంది. తెలుగు రాష్ట్రాలలో విస్తరించలేకపోయినా ఎఐఎంఐ ఎం మెల్లిమెల్లిగా బయటి రాష్ట్రాలలో విస్తరిస్తూ ఉంది.
బిజెపికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే సెక్యులర్ పార్టీలులేకపోవడంతో బిజెపి గురించి గట్టిగా గర్జించే శక్తి ఈ పార్టీ కూడదీసుకుంది. అందుకే బిజెపి విస్తరిస్తూ ఉండటంతో ఎమ్ ఎఎం కూడా గొంతు పెంచింది. బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ రోజు కౌంటింగ్ జరిగిన ఉప ఎన్నికల్లో ఈ పార్టీ పనితీరు బాగా మెరుగుపడింది. మహారాష్ట్రలో మూడు అసెంబ్లీ స్థానాలో ఈ పార్టీ లీడింగ్ లో ఉంది.
బీహార్ కిషన్ గంజ్ ను గెల్చుకుంది. ఖమ్రూల్ హోడా కిషన్ గంజ్ లో 11 వేల వోట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈ పార్టీ 2014లో మహారాష్ట్రలో ఒక సీటు గెల్చుకుంది.
బీహార్ లో ఈ సీటును గెల్చుకునేందుకు అసదుద్దీన్ ఆహోరాత్రులు శ్రమించారు. బీహార్ సీమాంచల్ లో ఉన్న ఈ సీటు కోసం అనేక సార్లు ఎంఐఎం ప్రయత్నించింది.ఓడిపోయింది. ఈ నియోజకవర్గంలో 70 శాతం ముస్లింలుంటారు. అసద్ బిజెపి వ్యతిరేక ఉపన్యాసాలు ఈ సారి బాగా పని చేశాయి. పార్టీ అభ్యర్థి హోడా గెలిచాడు.
ఇంత విశాల భారతంలో ఎమ్ ఐ ఎమ్ చాలా చిన్న పార్టీ. ఇది దేశ ఎన్నికలను ప్రభావితం చేయలేదు గాని, బిజెపి విస్తృతమవుతున్నపుడు అసదుద్దీన్ బిజెపి వ్యతిరేక వైఖరి వల్ల ఈ పార్టీ కూగా విస్తరిస్తూ ఉంది. అసదుద్దీన్ వయసు 50 సంవత్సరాలు.