భారతక్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అంతా క్రికెట్ వ్యవహారమే కదా. అయితే, ఇంతవరకు ఈ బోర్డుకు నాలుగు సందర్బాలలోనే క్రికెటర్లు ఛెయిర్మన్ గా ఎన్నికయ్యారు.
ఇందులో ఒకరు ఈ రో జు 39 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరబ్ గంగూలి.
మిగతా వారిలో ఒకరు తెలుగు వాడు. ఈక్రికెటర్లలో కూడా ముగ్గురు కెప్టెన్లు న్నారు. బిసిసిఐ రెండో అధ్యక్షుడు పూసపాటి విజయానంద గజపతి రాజు ఎపుడో బిసిసిఐ అధ్యక్షుడయ్యారు. ఆయన 1954 నుంచి 1957 దాకా బిసిసిఐ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సునీల్ గవాస్కర్ కొద్ది రోజులు బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు 2014లో ఉన్నారు.
అప్పటి ఛెయిర్మన్ ఎన్ శ్రీనివాసన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినపుడు గవాస్కర్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.
తర్వాత 2014లోనే శివలాల్ యాదవ్ ను సుప్రీంకోర్టు బోర్డు అధ్యక్షుడిగా నియమించింది. ఈ నలుగురిలో ఇద్దరు మాత్రమే ఫుల్ టైం అధ్యక్షుడు.
ఇక తెలుగు బిసిసిఐ అధ్యక్షుడి గురించి తెలుసుకుందాం
తమాషా ఏమంటే ఇండియన్ టీమ్ కెప్టెన్ గా ఆయనకు అంత పేరు రాలేదు. ఆయన్ని ఆరోజుల్లో సర్ విజ్జీ అని పిలిచే వారు. బాగా డబ్బుంది కాబట్టి నాటి క్రికెట్ కు ఆయన కొండంత అండగా ఉండేవారు.1932లో భారత జట్టు ఇంగ్లండు సందర్శిస్తున్నపుడు ఆయన వైఎస్ కెప్టెన్.
అయితే టూర్ వెళ్ల లేకపోయారు.కాకపోతే ఖర్చంతా ఆయన పెట్టుకున్నారని చెబుతారు.
తర్వాత ఆయన అనారోగ్య కారణాలవల్ల కొద్ది రోజుులు క్రికెట్ నుంచి తప్పుకున్నా మరొక సారి ఇంగ్లండ్ టూర్ వెళ్తున్నపుడు ఆయన కెప్టెన్ అయ్యారు.ఆయన పర్ ఫామెన్స్ ఎవరికి నచ్చలేదు. 33 పరుగులు మాత్రం చేశారు. ఆయన అవ్రేజ్ 8.25 మాత్రమే. ఆయన మొత్తం 47 ఫస్ట క్లాస్ గేమ్స్ అడారు. 1228 పరుగులు చేశారు. అయిదే సార్లు 50 సాధించారు.
ఆయన కెప్టెన్ గా ఉన్నపుడు లాలా అమర్ నాథ్, సికె నాయుడు, సయ్యద్ ముస్తాక్ ఆలీ,విజయ్ మర్చంట్ వంటి ఉద్ధండులు టీమ్ లో ఉండే వారు.
ఆయన బిసిసి ఐ అధ్యక్షుడిగా ఉన్నపుడే లాలా అమర్ నాథ్ కెప్టెన్ ను చేశారు. సికె నాయుడు 61 వ యేట ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడేందుకు సహకరించారు.
కాన్పూర్ గ్రీన్ పార్క్ కు స్టేడియం కు టెస్ట్ స్టేటస్ తెచ్చింది ఆయనేనని చెబుతారు. 1936లో ఇండియా టీమ్ ఇంగ్లండు టూర్ లో ఉన్నపుడే ఇండియా దారుణంగా ఓడిపోయింది.బాగా అపకీర్తి పాలయింది. అయితేనేం, ఆయనకు నైట్ హుడ్ (సర్ ) లభించింది.
ఎవరీ విజయ్ ఆనంద్ గజపతి రాజు?
విజయనగర రాజా పూసపాటి విజయ రామరాజు రెండో కుమారుడాయన. ఆయన పుట్టింది విజయనగరంలోనే. తండ్రి చనిపోయాక ఆయన సోదరుడు రాజా అయ్యారు. తర్వాత ఆయన ఎస్టేట్స్ను కాశీకి మార్చారు. కాశీపూర్ జమిందారు కూతరిని ఆయన పెళ్లిచేసుకున్నారు.
ఆయన ఆజ్మీర్ లోని మయో కాలేజీలో చదువుకున్నారు. తర్వాత ఇంగ్లండు వెళ్లారు. కాలేజీరోజుల్లో ఆయన టెన్నిస్, క్రికెట్ లలో బాగా రాణించారు.
ఆయన తన రాజ ప్రాసాదంలోనే క్రికెట్ గ్రౌండ్ నిర్మించుకుని క్రికెట్ ప్రాక్టీస్ చేసేశారు. 1926లో భారతదేశ, విదేశీ క్రీడాకారులతో ఒక టీమ్ తయారు చేసుకున్నారు.
1930లో రాజకీయ కారణాల వల్ల ఎంసిసి ఇండియా టూర్ ను రద్దు చేసినపుడు ఆయన సొంతఖర్చులతో సొంత టీమ్ ను విదేశాలకు పంపాడని చెబుతారు.
అలా సిలోన్ కు,ఇంగ్లండు టూర్లకు పంపాడు. దీనితో ఆయన వైస్ రాయ్ కి లార్డ్ విల్లింగ్డన్ కుకూడా దగ్గిరయ్యారు.
ఆయన గొప్ప క్రికెట్ క్రీడాకారుడు కాకపోయినా, ఆయన సంపద, సంబంధాలు ఆయనను దేశంలో ఒక ప్రముఖ క్రికెటర్ గా మార్చాయి.
1936లో ఇంగ్లండు టూర్ వెళ్తున్న టీమ్ గా ఆయన కెప్టెన్ అయ్యారు. అయితే ఆయన నాయకత్వం ఏమీ బాగా లేదు.టీమ్ లో ఆయన కు సన్నిహితులయిన లాలా అమర్ నాథ్, సికె నాయుడు, విజయ్ మర్చంట్ లు ఆయన క్రికెటింగ్ సామర్థ్యాన్ని విమర్శించారు. దీనితో టీమ్ లో పాలిటిక్స్ వచ్చాయ్, గొడవలు మొదలయ్యాయి.
ఆయన లంచం ఇచ్చి టీమ్ మెంబర్లు ఓడిపోయేలా చేశాడనే విమర్శ కూడా ఉంది.మొత్తానికి ఇండియా ఓడిపోయింది. అయితే, ఆయన నైట్ హుడ్ లభించింది. భారతీయ క్రికెట్ చరిత్రలో నైట్ హుడ్ వచ్చిన ఏకైక క్రికెటర్ ఆయనే.
అయితే, దీనిని ఆయన తిరస్కరించారు. ఈ మేరకు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కు లేఖరాస్తూ ఇలాంటి నైట్ హుడ్ తీసుకోవడం స్వతంత్ర భారత సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
తర్వాత ఎంసిసి ఆయనకునేరుగా సభ్యత్వాన్ని ఇచ్చింది.
ఆయన కెప్టెన్సీ బాగా చెడ్డపేరుతో రావడంతో ఆయన క్రికెట్ ఆడటం మానేశారు. తర్వాత ,రెండు దశాబ్దాల మౌనంతర్వాత ఆయన 1954 ఏకంగా బోర్డు అధ్యక్షుడయి 1957 దాకా ఉన్నారు. 1958లో ఆయన పద్మభూషణ్ వచ్చింది. 1965 డిసెంబర్ 2న బెనారస్ లో చనిపోయారు.