ఆర్టీసీ వాళ్లతో చర్చల్లేవ్ :తెగెేసి చెప్పిన కెసిఆర్

కార్మిక సంఘాల ను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  కొద్ది సేపటి కిందట ఆయన 18 రోజులుగా సాగుతున్న ఆర్టీసి సమ్మె గురించి  అధికారులతో  చర్చించారు.

అసలు ఆర్టీసీలో యూనియన్ల గొడవేమిటని, యూనియన్ లు లేని ఆర్టీసీ కావాలని ఆయన  అధికారులతో అన్నారు.

యూనియన్ లు లేకుండా  ఉంటేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుంది ఆర్టీసి నష్టాలకు  కారణంయూనియన్లే నని ఆయన విమర్శించారు.

‘నష్టాల్లో ఉన్న సంస్థ లో అధికంగా జీతాలు పెంచమని ఏ న్యాయస్థానం చెప్పదు. ఆల్విన్ కంపెనీ నష్టాలతో లాక్ ఔట్ అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేశారు? ఆర్టీసీ మరో ఆల్విన్ కంపెనీ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే,’ అని ఆయన కరాఖండిగా చెప్పారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులు మా ఉద్యోగాలు ఇమ్మని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ కొన్ని యూనియన్లు సమ్మె విరమిస్తం హామీ ఇవ్వండి అని నా దృష్టికి తీసుకొచ్చాయని కెసిఆర్ ఒక రహస్యం బయటపెట్టారు.

ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ల తో లాలూచీ పడాల్సిన అవసరం లేదని చెబుతూ ఆర్టీసీ దివాలా పరిస్థితిని  కోర్ట్ ముందు ఉంచాలని ఆయన  అధికారులను ఆదేశించారు.

సమ్మె వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడకుండా ఉండేందుకు రేపటి నుంచి  కట్టుదిట్టంగద త్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.