తెలంగాణలో సాగుతున్న ఆర్టీ సి సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ పన్నెండు రోజులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త సత్యం ఆవిష్కరించాయి. బాగా బలపడిన ఒక మూఢ నమ్మకాన్ని వమ్ము చేశాయి.సమ్మెచేయించినా, తెలంగాణ ఉద్యమం చేసినా, ఉపన్యాసం ఇచ్చినా ‘ ఆయన’ వంటి మహానేత అవసరమని అంతా నమ్ముతున్న రోజులివి.
అందుకే తెలంగాణ తీసుకువచ్చాక, కెసిఆర్ రాజ్యం వచ్చాక, ఇక సమ్మెచేసేందుకు నాయకుడుండని, ప్రతిపక్షాలను నడిపేందుకు నాయకుడుండని చాలా మంది మేధావులు నమ్ముతున్న రోజులు.
ప్రతిపక్షమయినా, అధికార పక్షమయినా తెలంగాణలో కెసిఆర్ వంటి మహా మేధావి, మహానేత ఉండాల్సిందే అని విశ్వసిస్తున్న రోజులు.
నాటి మిడిల్ క్లాస్ కలల రాణి బజాజ్ చేతక్ మళ్లీవస్తాంది, ఈసారి కరెంటుతో…
ఇక తెలంగాణలో ప్రభుత్వ పార్టీయే తప్ప ప్రతిపక్షం ఉండదు, బంగారు తెలంగాణలో సమ్మెలుండవు,నిరసనలుండవ్, ఉండేవన్నీనీల్లు, నిధులు, ఉద్యోగాలు మాత్రమే అని చాలా మంది మేధావులు మాట్లాడుతున్న రోజుల్లో ఇదంతా మూఢ నమ్మకమని పెద్దగా చదువు సందె లేని ఆర్టీసోళ్లు , రక్తంతో కన్నీళ్లతో రాసి చూపించారు.
ఇది గానం చేసేందుకు చాలా మంది కవులకు పెద్ద ఉద్వేగ పూరితమయిన కంటెంటులాగా కనిపించకపోవచ్చు. అయినా సరే ఆర్టీసి వాల్లు సమ్మెను 12వ రోజుకు సునాయాసంగా తీసుకువచ్చారు, త్యాగాల బాటలో.
ఆర్టీసోల్లు సమ్మెచేస్తే వూరూర ప్రజలు తిరగబడలే. జె ఎసిలు పెట్టుకుని డిపోల ముందుకొచ్చి బస్సులు నడపండనే బ్యాక్ ల్యాష్ లే. అదే ఈ పన్నెండురోజుల విచిత్రం.
మహామేధావి, కాకలు తీరిన రాజకీయ యోధులు లేకపోయినా ఆర్టీసి కార్మికులు సమ్మెను ఫుల్ జోష్ తో ముందుకు తీసుకువెళ్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి సంఘం వాళ్లకి మద్దతు ప్రకటించి వాళ్లకు అండగా నిలుస్తున్నది. ఉద్యమాలు చేయడానికి మహానేతలు అవసరంలేదు, కడుపు మంట, ఆవేదన, న్యాయం ఉంటే చాలు అని తెలంగాణ ఆర్టీసి కార్మికులు రుజువు చేస్తున్నారు.