కళ్ళు లేవు, పట్టుదల నడిపించింది, సబ్ కలెక్టరయిన మొట్టమొదటి బ్లైండ్ ఐఎఎస్ అధికారి

భారతదేశంలో తొలిసారి ఐఎఎస్ కు ఎంపికయిన విజువల్లీ ఛాలెంజ్ డ్ (అంధురాలు) మహిళ ప్రాంజల్ పాటిల్ (31) సోమవారం నాడు కేరళ తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఎర్నాకులంలో   అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని సబ్ కలెక్టర్ గా తమ జిల్లాకు రావడంతో  అక్కడి కలెక్టొరేట్ లో  చాలా సందడి వాతావరణం నెలకొంది. ఆమెకు కార్యాయలంలో ప్రత్యేక స్వాగతం లభించింది.

పుష్ప గుచ్చాలతో, లడ్డులతో ఆమెకు కలెక్టర్  గోపాలకృష్ణన్,  కలెక్టొరేట్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.గోపాలకృష్ణ న్ కూడా పుష్పగుచ్ఛం అందించి ఆమెకు స్వాగతం పలికారు.

నాటి మిడిల్ క్లాస్ కలల రాణి బజాజ్ చేతక్ మళ్లీవస్తాంది, ఈసారి కరెంటుతో…

అంతేకాదు, రాష్ట్ర  సామాజిక న్యాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి  బిజూ ప్రభాకర్ కూడా ఆమెకు స్వాగతం పలికేందుకు కలెక్టొరేట్ కు వచ్చారు. మంగళవారం నాడు ఏకంగా చీఫ్ సెక్రెటరీ టామ్ జోస్ కూడా ప్రాంజల్ కార్యాలయానికి వచ్చి ఆమెను పరామర్శించారు.

పాటిల్ మహారాష్ట్రంలోని    ఉల్లాస్ నగర్ కు చెందినది.  ఆరో ఏట రెటీనల్ డిటాచ్ మెంట్ వల్ల  ఆమెకు కనుచూపు పోయింది. చూపు పోయింది గాని జీవితంమీద ఆమె విశ్వాసం పోలేదు. పట్టుదల సడల లేదు.

చిన్నప్పటి నుంచే ఆమె హై వపర్డ్ కళ్లద్దాలుండేవి అయితే, ఆరో ఏట  రెండు కళ్లలో ఆమె చూపు పూర్తిగా పోయింది. ఆపరేషన్లు కూడా జరిగాయి. నొప్పి మిగిలింది చూపు రాలేదు. అయినా సరే ఆమె తన  దైనందిక కార్యక్రమాలను సులభంగా చేసుకుంటూ వచ్చేంది.

తాను పిన్న వయసులోనే ఉన్నందువల్ల  చూపు పోయిన ప్రభావం పెద్ద గా నా మీద పడలేదని చెప్పారు.

బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. ముంబయిలోని  కమలా మెహతా దాదర్ అంధుల స్కూల్ లో చదివారు.  12వ తరగతిలో 85 శాతం మార్కులతో పాసయ్యారు.

ముంబయి లోని అంధుల  సెయింట్ జేవియర్స్ లో పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదివారు.  చివరకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో    ఎమ్మే చేశారు. ఇపుడు జెఎన్ యులోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏసియన్  స్టడీస్ లో పిహెచ్ డి చేస్తున్నారు.

ఇలా చదువుతూనే  సివిల్స్ రాశారు. 2016లో మొదటి సారి రాసినపుడు ఆమెకు 733వ ర్యాంకు వచ్చింది. అపుడామె వయసు 26 సంవత్సరాలు.  మరుసటి సంవత్సరం 124 వ ర్యాంకు రావడంతో ఐఎఎస్ కు ఎంపికయింది. ఆమెకు కేరళ క్యాడర్ కేటాయించారు. ఈ రోజు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్బంగా ఆమె తల్లితండ్రులు కూడా తిరువనంతపురం వచ్చారు.

ఆమె సివిల్స్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కోచింగ్ తీసుకుంటే అనవసరంగా మానసిక వత్తిడి పెరుగుతుందని భావించారు. సివిల్స్ గురించిన డిస్కషన్స్  కు హాజరుకావడం, మాక్ పేపర్లను సాల్వ్ చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఎమ్మే కోసం జెఎన్ యు కు వెళ్లడంతో తన  మనసు సివిల్స్ మళ్లిందని ఆమె చెప్పారు. అక్కడి ఎకడమిక్ వాతావారణం ఆమెకు బాగా స్ఫూర్తి నిచ్చింది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/andhra-to-set-up-outsourcing-corporation-for-jobs/

ఒక సారి ఒక స్నేహితురాలు ఐఎఎస్ గురించి పత్రికలో వచ్చిన వ్యాసం చదివి వినిపించారు. అపుడే ఆమె మనసులో ఐఎఎస్ బీజం పడింది. అయితే, 2015 దాకా   ఆమె సివిల్సో జోలికి రాలేదు. ఆయేడాది ఎంఫిల్ చేస్తున్నపుడు ఇక సివిల్స్ కు కూడా ప్రిపేర్ అవుదామని చదవడం ప్రారంభించింది. ఈ ప్రిపరేషన్ లో టెక్నాలజీ బాగా ఆమెకు సహకరించింది. జాబ్ ఏక్సెస్ విత్ స్పీక్ (JAWS) ఆమె కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారు. కనుచూపులేని వారికి  బ్రెయిలీ లిపిలోకి టెక్స్ట్ ను మారుస్తూ చదివే సాఫ్ట్ వేర్ ఇది (Text to speech output).

సివిల్స్ పరీక్షలో నెగ్గిన తొలి అంధ అభ్యర్థి ఆమె. ఆమె ఎంపిక లక్షలాది మంది విజువల్లీ చాలెంజ్ డ్ అభ్యర్థుల్లో అపుడు స్ఫూర్తి నింపింది.

జపాన్ కు చెందిన బౌద్ధ భిక్షువు, ఆణ్వాయుధ వ్యతిరేక ఉద్యమకారుడు దైశాకు ఇకెడా (Daisaku Ikeda) తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పారొకసారి.

‘ I love to read and the entire process of academics excites me. My inspiration is Daisaku Ikeda, a Buddhist philosopher, educator, author and anti-nuclear activist from Japan. I studied on my own and took test series from private academy in Delhi,”అని ఆమె ఒక సారి ఆమె పుణె ప్రసార భారతి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె చెప్పారు.