ఆర్టీసీ సమ్మె కు ఒక పరిష్కారం కొనుగొనాలని హైదరాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన మాట వినకుండా,విధులకు హాజరుకాకుండా తమను తాము డిస్మిస్ చేసుకున్న ఉద్యోగులతో చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి ఖరాకండిగా చెప్పినపుడు హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అంతేకాదు, ఇలా ఇగో ప్రదర్శించడం మంచిది కాదని కూడా కోర్టు సలహా ఇచ్చింది.
అంతేకాదు, రెండు రోజుల్లో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు పూర్తిచేసి రిపోర్ట్ సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
ఆర్టీసికి పూర్తిస్థాయి ఎండి లేని విషయాన్ని కూడా ప్రత్యేకంగాప్రస్తావిస్తూ వెంటనే పూర్తి స్థాయి ఎండిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇ చ్చింది.
ఎండి లేకుండా ఇంత పెద్ద సంస్థను ఎలా నడుపుతారని, కార్మికులలో ఎలా విశ్వాసం కలిగిస్తారని కూడా ప్రశ్నించింది.
ప్రజలుసంక్షేమంకోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే ప్రభుత్వానికి ఆర్టీసి కార్మికులు ప్రజల్లో భాగమని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
సమ్మె వ్యవహారంలో ప్రభుత్వం తీరు సరిగ్గాలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు వేల బస్సులకు డ్రైైవర్లను కండక్టర్లను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆర్టీసి అనేది ప్రభుత్వ, కార్మికుల సమస్యగా ఎలా చేస్తారుని, ఇది ప్రజల సమస్య కాదా అని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని కటువుగా ప్రశ్నించినట్లే కార్మికులను కూడా కోర్టు తప్పుపట్టింది.
మీరు లెవనెత్తుతున్న సమస్యలు న్యాయమైనవేకావచ్చు, అయితే వాటికోసం పండగ పూట సమ్మె చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడంలో న్యాయం లేదని కోర్టు పేర్కొంది.
ఈ అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున కార్మికులు ఎవ్వరు తొందరపడి ఆత్మహత్య లకు పాల్పడవద్దని హైకోర్టు కార్మికులను సలహా ఇచ్చింది.
హైకోర్టు ఇంకా ఎంచెప్పిందంటే…
ఇరు పక్షాలు ఇలా ఇగో వ్యవహారం చేయడం వల్ల సమస్యలకి పరిష్కారం దొరకదు, యూనియన్స్, సర్కార్ మెట్టు దిగి ప్రజలకు సమస్య లేకుండా చూడాలి.
రెండు రోజుల్లో ఎలాంటి నిర్దిష్ట ప్రణాలికా చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వం కూలంకషంగా కోర్ట్ కు రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న హైకోర్టు.
ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికుల తో చర్చలు ప్రారంభించి ఉండాలని హైకోర్టు ఆభిప్రాయపడింది.