ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చుకున్నవారిలో ఒక మహిళ ఉన్నారు. ఆమె పేరు ఈస్తర్ డఫ్లో. ఆమె భర్త అభిజిత్ తో కలసి ఈ ఏడాది బహుమతిని షేరు చేసుకోవడం విశేషం. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండో మహిళ డఫ్లో…
మరి మొదటి మహిళ ఎవరు?
ఎలినార్ ఓస్ట్రామ్ (Elinor Ostrom) ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చుకున్న మొదటి మహిళ. ఆమె ఇండియానా యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఆమె బెర్క్లీ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మరొక ప్రొఫెసర్ ఆలివర్ విలియమ్ సన్ తో కలసి అవార్డు పంచుకున్నారు.2009 లో ఈ అవార్డు ప్రకటించారు. అప్పటికి వీరిద్దరి వయసు 76 సంవత్సరాలు.
ఎకనమిక్ గవర్నెన్స్, వనరుల వినియోగంలో ఎదురయ్యే ఘర్షణలను నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించడం మీద ఎలినార్ పరిశోధనలుచేశారు.
నిజానికి అభిజిత్, డఫ్లో పరిశోధనల లాగానే ఎలినార్ పరిశోధనకూడా దారిద్య్ర నిర్మూలనకు దగ్గరగా వుంటుంది. ఆమె సిద్ధాంతం ప్రకారం, అడవులు, మత్స్య సంపద వంటి సహజ, సామాజివక వనరుల మీద ప్రభుత్వం పాలన కంటే స్థానిక ప్రజల యాజమాన్యం వల్లే మంచి ఫలితాలొస్తాయి.
ఇలాంటి వనరులను ఎలా వాడుకోవాలనే నియమనిబంధనలను ప్రభుత్వాలు కాకుండా హక్కుదారులే నిర్ణయించడం మంచిదని ఆమెవాదిస్తారు.
ఇది ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వాలు నమ్మే సిద్ధాంతాలకు పూర్తిగా భిన్నమయింది. ఎందుకంటే, సంస్థలను (ఉదాహరణకు ఆర్టీసి) నడిపితే ప్రభుత్వాలు నడపాలి. వాటికి నష్టాలొస్తే ప్రయివేటీకరించాలి అనేది ఇప్పటి ప్రభుత్వాల విధానం.
దీనిని ఎలినార్ పరిశోధనలు తిరస్కరించాయి.
మంచి ఫలితాలు ఇలాంటి వనరులను ప్రభుత్వాలు కాకుండా స్టేక్ హోల్డర్స్ అంటే హక్కుదారులే నడపుకున్నపుడే వస్తాయని ఆమె చెప్పారు.
నేపాల్ లో రైతులు నిర్వహించే చెరువులు, జలశయాలు,డ్యాముల వంటి సాంప్రదాయిక జలవనుల స్థానంలో సిమెంట్ నిర్మాణమయ్యే భారీ ప్రాజక్టులను నిర్మించి వాటిని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని మీద ఆమె పరిశోధనలు చేశారు.
సాంప్రదాయిక వనరుల స్థానంలో ఆధునిక వసతులను నిర్మించడం వల్ల జరుగుతున్న అనర్థాలను ఆమె అధ్యయనం చేశారు.
తర్వాత ఆమె మెయిన్ (ఇంగ్లండు) లో రొయ్యల మత్య్సకారులు మీద పరిశోధనలు చేశారు. ఏమేరకు చేపలు (రొయ్యలు)పట్టాలి, ఎపుడు పట్టాలి,ఎప్పుడు పట్టరాదు వంటి నియమనిబంధనలు ప్రభుత్వం కాకుండా మత్స్యకారులే నిర్ణయించుకుంటే వనరులు బాగా సద్వినయోగపడతాయని, దీర్ఘ కాలం వనరులు పరిరక్షింప బడతాయని ఎలినార్ చెప్పారు.
ఎలినార్ చెప్పిన సిద్ధాంతం తెలంగాణ ఆర్టీసికి వర్తిస్తుందా? ఎందుకంటేనష్టాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసిని ప్రయివేటీకరించాలనుకుంటున్నది. నడిపితే ప్రభుత్వం నడపాలి, లేదా ప్రయివేటు వాళ్లునడపాలన్న వాదన ఇది. అయితే ఎలినార్ దీని కంటే స్టేక్ హోల్డర్సే నడుపుకుంటే బాగుందనిచెబుతున్నారు.
అపుడే వనరులు సద్వినియోగపడతాయని, ఎక్కువ కాలం పరిరక్షింపబడతాయని ఆమె పరిశోధనలు చెప్పాయి. ఇందులో తెలంగాణ ఆర్టీసికి సొల్యూషన్ ఉందేమో తెలంగాణా మేధావులు అలోచించాలి.
ఇలాంటి హోమ్ రెమిడీలు (గృహ వైద్యాలు) అవినీతి మయమయిన ప్రభుత్వాలకు నచ్చుతాయా?
ఇవి కూడా చదవండి
ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ తీహార్ జైల్లో ఉన్నారు తెలుసా?