ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ తీహార్ జైల్లో ఉన్నారు తెలుసా?

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకుంటున్న ప్రఖ్యాత భారతీయ సంతతి ఆర్థిక వేత్త  అభిజిత్  బెనర్జీ పదిరోజులు తీహార్ జైల్లో కడిపారు. ఆయన న్యూఢిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో విద్యార్థుల అందోళనలో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది.

2016లో విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్  ను రాజద్రోహం కింద ఇదే జెఎన్ యులో జైలు కు పంపినసంగతి తెలుసుగదా. దాదాపు ఇలాంటి సంఘటనే అభిజిత్ క్యాంపస్ లో ఉన్నపుడు కూడా జరిగింది. 2016లో కొంతమంది జెఎన్ యు విద్యార్థుల మీద రాజ్రదోహం నేరం మోపినపుడు అభిజిత్ హిందూస్తాన్ టైమ్స్ పత్రికలో  తన పది రోజుల తీహార్ జైలు జీవితం గురించి రాశారు.‘మమ్మల్ని చావగొట్టారు. తీహార్ జైల్లోకి తోశారు. అయితే,రాజద్రోహనేరంకాదు, హత్యానేరం వగైరా కేసులు.వైస్ చాన్స్ లర్ తోపాటు మరికొందరిని హత్య చేసేందుకు ప్రయత్నించారన్నది అపుడు తీహార్ జైలుకు వెళ్లిన విద్యార్థుల మీద చేసిన ఆరోపణ.

పుస్తకాల పురుగని పేరున్నా క్యాంపస్ రాజకీయ కార్యకలాపాలలో కూడా అభిజిత్ చురుకుగా పాల్గొనే వాడు. 1983లో ఒక సారి అప్పటి కాలేజీ యూనిన్ అధ్యక్షుడిని యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు. దీనికి నిరసన చెబుతూ విద్యార్థులు వైఎస్ చాన్స్ లర్ ఇంటిముందు ధర్నా చేశారు. ఇదే నేరం. దీనిమీదే  ఆ ధర్నాలో పాల్గొన్నవిద్యార్థుల మీద హత్యానేరం మోపారు.

అదృష్ఠం కొద్ది       ఈ కేసులను ఉపసంహరించుకున్నారు, అప్పటికే మేం పదిరోజులు జైల్లో గడిపాం,’ అని ఆయన రాశారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోద్బలంతో పోలీసుల విద్యార్థుల మీద కేసులు పెట్టినట్లు ఆయన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది జవహర్ లాల్ యూనివర్శిటీ మీదపెత్తనం చలాయించేందుకే ననే విషయంలో అనుమానమే లేదని అభిజిత్ రాశారు. ‘ మేమే రాజులం, నోరుమూసుకోండి, బుద్ధిగా నడచుకోండని మాకుచెప్పడమే ఈ కేసుల ఉద్దేశమని ఆయన ఈ వ్యాసం రాశారు.తనకాలం నాటి అరెస్టులకు, 2016లో జరిగిన అరెస్టులకు సామ్యం చెబుతూ  అప్పటిలాగే ఇపుడు కూడా కాలేజీ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకునేది యూనివర్శిటీ క్యాంపస్ ను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే నని అభిజిత్ పేర్కొన్నారు.

అభిజిత్ కు,భార్య  ఈస్తర్ డఫ్లోలతో పాటు  మైఖేల్ క్రెమెర్ లకు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. పేదరిక నిర్మూలన అధ్యయనంలో వాళ్లు Randomised Controlled Trials (RCT) అనే విధానం ఉపయోగించి పరిశోధనలను విప్లవాత్మకం చేసినందుకు  నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మహిళలలో డఫ్లో రెండో మహిళ.

కలకత్తా విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నాక ఆర్థిక శాస్త్రంలో పిహెచ్ డి చేసేందుకు ఆయన హార్వర్డ్ వెళ్లారు.

అభిజిత్ వామపక్ష భావాలున్నవాడు. సమాజాంలో విభిన్నాభిప్రాయలకు చోటుండాలని వాదిస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/pm-tweeted-four-hours-late-to-congratulate-abhijit-on-winning-noble-economic-prize/