తూర్పు గోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఏబిఎన్ పత్రికా రిపోర్టర్ కాతా సత్యనారాయణను మంగళవారం రాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ తొండంగి అర్బన్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం అయిన వెంకటాపురం వెళ్ళి వస్తుండగా ఎస్.అన్నవరంలో తన ఇంటికి సమీపంలోనే దుండగులు హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆయన మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ప్రాధమిక విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించియది . ఈ
కేసును సీరియస్ గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలంటు రాష్ట్ర డిజిపి కి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.ఈ ఘటనపై డిజిపి సవాంగ్ కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. తక్షణం సంఘటన స్థలంలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటూ ఎస్పీకి డిజిపి ఆదేశించారు, హత్య చాలా దారుణమైన ఘటన అని డిజిపి వ్యాఖ్యానించారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.