FLASH… FLASH బందరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

మచిలీ పట్నంలో తెలుగుదేశం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు.

ఇసుక రాజకీయాలకు వ్యతిరేకంగా 36 గంటల నిరసన చేసేందుకు ఆయన  కొద్ది సేపటి కిందట బందరు కోనేరు సెంటర్ దగ్గరకు వచ్చారు. కోనేరు స్థూపం వద్ద బైఠాయించి నిరసన దీక్షకు కూర్చున్నారు. వెంటనే  రవీంద్ర ను  పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో పట్టణమంతా తిప్పి చివరకు ఇంటికి తరలించారు. ఇంటి వద్దనే కొల్లు రవీంద్ర తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు.

అంతకు ముందు ఏం జరిగిందంటే…

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇసుక కొరతను కావాలనే సృష్టించిందని నిరసన తెలుపుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతల హౌస్ అరెస్టులకు  రంగం సిద్ధం చేశారు.

ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధియక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులుహౌస్ అరెస్ట్ చేశారు.

కొల్లు రవీంద్ర ఇంటికి భారీగా  పోలీసు బలగాలు తరలించారు.

కోనేరుసెంటరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరసన దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి  వెళ్ళనీయకుండా ముందుగానే అర్జునుడును హౌస్ అరెస్ట్ చేశారు.

ముఖ్య టీడీపీ నేతలను ఒకొక్కరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర  దీక్ష నేపథ్యంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు.

ఇది ఇలా ఉంటే తన  36గంటల నిరవధిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికులను కోరుతూ  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కరపత్రాలు పంపిణీ చేశారు.

ఉద్రిక్తత ఉత్కంఠ

మరో వైపు ఇసుక కొరతను నిరసిస్తూ కోనేరుసెంటరు వేదికగా ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష

ఇందుకు కౌంటర్ గా కొల్లు దీక్షా శిబిరం ఎదుటే ప్రతిపక్ష టీడీపీ తీరును నిరసిస్తూ తాము నిరసన తెలుపుతామని ప్రకటించిన అధికార వైసీపీ నేతలు

ఇదీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నెలకొన్న తాజా పరిస్థితులు

శుక్రవారం జరగబోయే డీఆర్సీ సమావేశానికి అధికారగణమంతా వస్తున్న నేపథ్యంలో 36 గంటల నిరవధిక దీక్షకు మాజీ మంత్రి రవీంద్ర పిలుపునిచ్చారు.