ప్రముఖ జర్నలిస్టు టివి9 ఫేమ్ రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటికి పదిమంది పోలీసులు బృందం వెళ్లి అదుపులోకి తీసుకుంది.
ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనాయి. కంపెనీ నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లోగోని అనధికారికంగా అమ్మారనే ఆరోపణల పై మరో కేసు నమోదైంది.
ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 crpc కింద నోటీసు ఇచ్చారు.
ఈ రెండింటిలో కూడా గతంలోనే అధికారులు విచారించారు.
ఇపుడు ABCL కంపెనీ కి చెందిన 12 కోట్ల డబ్బుని వ్యక్తిగతానికి రవి ప్రకాష్ , మరొక వ్యక్తి మూర్తి వాడుకున్నట్లు చెబుతున్నారు. కంపెనీ నిధుల్ని ఇతర డైరెక్టర్లకి చెప్పకుండా విత్ డ్రా చేసినట్టు ప్రాథమిక సాక్షాలున్నాయని చెబుతూ బంజారాహిల్స్ పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. 409, 418, 420, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిసింది. రవిప్రకాష్ ని మరి కొద్ది సేపటిలో రిమాండ్ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అందాలి.