కోటంరెడ్డి గొడవ, బాబు చేసిన తప్పు జగన్ చేయకూడదు: మాకిరెడ్డి

నెల్లూరు రూరల్  అధికార పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు మహిళా MPDO నివాసంపై దాడిచేయడం జరగింది.  ఆ చర్యకు నిరసనగా ఆమె  పోలీసుస్టేషన్ ముందు ఆందోళన చేపట్టిన ఘటన రాష్ట్రంలో తీవ్ర దూమారం రేపుతోంది.
గతంలో చింతమనేని నేడు కోటంరెడ్డి .
పోలిక ఎలా ఉన్నా స్వభావం ఒక్కటే. గతంలో 2015లో  దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  (దిగవ ఫోటో) వనజాక్షి అనే   మహిళా రెవిన్యూ అధికారి వనజాక్షి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇసుక అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలనుకోవడమే ఆమె చేసిన తప్పు.ఆమె ఎమ్మెల్యే అనుచరుల ఇసుక అక్రమ మైనింగ్ ను అడ్డుకున్నారు. వారు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. అపుడాయన వచ్చి ఎమ్మార్వో మీద దాడి చేసి,తన అనుచరులను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు.  అపుడది పెద్ద గొడవ అయింది.
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జరిగిన చింతమనేని ఘటనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ చింతమనేని వ్యవహారంలో బాబు కఠినంగా వ్యవహరించి ఉండి ఉంటే సమస్య పరిష్కారం అవడంతో బాటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిఉండేది.
కానీ తమ పార్టీ అన్న కారణంతో చింతమనేని వైపు నాటి ముఖ్యమంత్రి  నిలబడటం వలన ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తెలుగుదేశం ప్రభుత్వ ప్రస్థానంలో ఒక చేదు అనుభవంగా మిగిలింది.
బాబు చేసిన పొరబాటు జగన్ మోహన్ రెడ్డి చేయకూడదు.
గతంలో చింతమనేని వ్యవహారంలో చంద్రబాబు పాత్ర లేకపోయినా పార్టీ అన్న కారణంతో వెనకేసుకొచ్చిన పలితం రాజకీయ మూల్యం చెల్లించుకున్నారు.
నేడు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ముందుకు వెళుతున్న జగన్ ప్రభుత్వానికి ఇలాంటి ఘటనలు ముందరి కాళ్ళబంధంగా మారుతుంది. కోటంరెడ్డి చర్యలు అనవసర అప్రతిష్టకు దారితీస్తుంది. ఇలాంటి చర్యలతోనే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరిగేది.
ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగితే రాజకీయ నష్టం తప్పదు. గత ప్రభుత్వ తప్పిదాలను చేయకూడదనుకుంటున్న జగన్ ఇలాంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు ఆశిస్తున్నారు.