తెలంగాణ సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ల తలరాతలు మార్చిన మొనగాడు…
ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణా (అపుడు ఆంధ్రప్రదేశ్) సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) బాధ్యతల్లోకి రావడం అపుడు ఒక సంచలనం.
పోలీసాఫీసర్ ను విద్యాసంస్థలకు అధిపతిగా వేయడం గతంలో ఎపుడూ జరగలేదు.
ఐఎఎస్ ఆఫీసర్లను నియమిస్తారు. లేదా విద్యారంగంలో కృషి చేసిన ప్రొఫెసర్లను నియమిస్తారు. ఇలా సోషల్ వేల్ ఫేర్ స్కూళ్లకు అధిపతిగా పోలీసాఫీసర్ ను నియమించినపుడు ప్రవీణ్ కుమార్ గురించి తెలియని వాళ్లు, కేవలం ఆయన్ని లాఠీ ఝళిపించే పోలీసుగానే చూసేవాళ్లు పెదవి విరిచారు.
ఆయన్ను సైడ్‌లైన్ చేశారనుకున్నారు. ఎందుకంటే ఈ పోస్టు కావాలని ఏ ఐఎఎస్ ఆఫీసర్ కోరడు. గ్లామర్ లేని పోస్టు.
అయితే, 2011లో హార్వర్డ్ లో ఒక ఏడాది చదువుకుని తిరిగి వచ్చాక 2011లో తనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసేటీకి పోస్టివ్వండని ఆయన కోరి తెచ్చుకున్నారు.
తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక ఆయన యూనిఫాం వేసుకోవాలనుకోలేదు. తను పేదల అట్టడుగు వర్గాల పిల్లలతో నిర్మించుకున్న TSWREIS ప్రపపంచంలోనే ఉండాలనుకున్నారు.
విద్యారంగంలోపనిచేసిన అనుభవం లేనివాడికి గురుకులాల బాధ్యత అప్పగిస్తే ఎలా అనుకున్నారు.
నిరుత్సాహపడ్డారు.గతంలో పోలీసాఫీసర్ గా ఆయన తీసుకున్న చర్యలు కొన్ని వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ సోషల్ వెల్ ఫేర్ హాస్టళ్ల బాధ్యతలను స్వీకరించారు.
ఆయన చేరిన కొద్ది రోజుల నుంచే ఈ సంస్థ సంచలన వార్తల్లో ఉంటూ వస్తున్నది. వివాదాస్పద వార్తల్లో కాదు, అన్నీ ఔరా అనిపించే సక్సెస్ స్టోరీల్లో.
చివరకేమయింది. ఈ రోజు TSWREIS విద్యారంగంలో చేసిన ప్రయోగాలలో భారతదేశంలోనే కాదు, దక్షిణాసియాలలో చర్చనీయాంశమయింది.
ఇపుడు ప్రపంచంలో మేటి విశ్వవిద్యాలయం గా పేరుపొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం TSWREIS సక్సెస్ స్టోరీ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నది.
ప్రభుత్వపాఠశాలలంటే ప్రజల్లో చాలా దురభిప్రాయం. అక్కడ పెద్ద బిల్డింగులున్నా, టీచర్లకు మంచి మంచి జీతాలున్నా, విద్యార్థుల్లో చదువుండదని. మంచిఫలితాలు రావని చిన్నచూపు.
ఎవరైనా ఎదురైనా, సోషల్ వెల్ ఫేర్ హుస్టల్ స్టూడెంట్ అంటే ఈ చిన్నచూపుండేది.
ఇలాంటపుడు చదవితే తెలంగాణ సోషల్ వెల్ ఫేర్ హాస్టళ్లలో చదవాలనే పరిస్థితి తీసుకువచ్చారు పోలీసాఫీసర్ ప్రవీణ్ కుమార్.
‘ఈ స్కూళ్లకు వచ్చే అట్టడుగు వర్గాల పిల్లలు చదవి చావరు’ అనే దురభిప్రాయం ఉన్న టీచర్ల మైండ్ సెట్ ను ఆయన మార్చేశారు.
‘మనమింతే, గవర్నమెంట్ స్కూళ్లోచదవుతున్నాం, మనం ఎందుకు పనికిరామేమే ’అనే ఆత్మన్యూనతకు గురయ్యే విద్యార్థుల మైండ్ సెట్ ఆయన మార్చేశారు.
లేదు, పిల్ల్లలను పిల్లల్లాగా చూసి, స్వేచ్ఛావాతావరణం కల్పించి, ఆ వయసును అర్థం చేసుకుని, దానిప్రకారం వాళ్లని చేరదీసి, శిక్షణ ఇస్తే వాళ్లు ఎవరెస్టునయినా సునాయాసంగా ఎక్కగలరని ప్రవీణ్ కుమార్ నిజం చేసి నిరూపించారు.
అవును, అక్షరాల అదే నిరూపించారు.ప్రపంచంలో అత్యున్నత శిఖారం మీద సోషల్ వెల్ ఫేర్ హాస్టల్ పేరు రాశారు.
అతి చిన్నవయసులో అంటే 13 సంవత్సరాల వయసులోనే మాలావత్ పూర్ణ ’హిమ సుందర శిఖరమయిన ఎవరెస్టు’ను 2014 లోనే ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించింది (ఫోటో దిగువన), తెలుసుగా.
నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ ఎవరనుకుంటున్నారు?
TSWREIS విద్యార్థి. డాక్టర్ ప్రవీణ్ గైడెన్స్ లో పెరిగి హిమాలయమంతా ఎత్తుకు ఎదిగిన పూర్ణ సోషల్ వెల్ ఫేర్ హస్టల్ స్టూడెంటే.
ఇపుడీ సొసైటీ కింద 268 విద్యాసంస్థలున్నాయి.వీటిలో 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయిదో తరగతి నుంచి డిగ్రీదాకా ఈ సంస్థలో కోర్సులున్నాయి.
రాష్ట్రంలో ఏ కార్పొరేట్ సంస్థకు తీసిపోని ఘనత వీళ్లది.
టివిలు పగిలిపోయేంతగా, గొంతుచించుకుని ఈ సంస్థ కార్పొరేట్ సంస్థల్లా అడ్వర్టయిజ్ మెంట్ల కుప్పించదు. నిజమో అబద్దమో తెలియనంత అనుమానంగా కోట్లు కోట్లు వెచ్చించి తమ ఫలితాలను న్యూస్ పేపర్లలో ప్రకటించుకునే అవకాశం లేని సంస్థ TSWREIS.
అంతా చాపకింద నీరు లాగా జరిగిపోతూ ఉంటుందిక్కడ, ప్రకటనలు ప్రతిభ ప్రదర్శన TSWREIS అడ్వర్టయిజ్ మెంట్.
నారాయణలు, చైతన్యలు అంత ఘన విజయాలు సాధిస్తూ ఉంటే, వాళ్ల బోధనా పద్ధతుల మీద ప్రపంచ యూనివర్శిటీలు ఎందుకు పరిశోధన చేయడంలేదు?
ప్రవీణ్ నడుపుతున్న TSWREIS విధానాల్లోనే ఏదో గొప్పదనం ఉంది, అదేమిటో కనుక్కుందామని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఎందుకు ముందుకు వస్తావుంది?
హార్వర్డ్ గ్రాజుయేట్ స్కూల్‌ఆఫ్ ఎజుకేషన్ విద్యార్థులు TSWREIS లో పాటిస్తున్న నియమాలేమిటనే విషయం పరిశీలించేందుకుతెలంగాణవ స్తున్నారు.
మీ వెల్ఫేర్ స్కూళ్లను అధ్యయనం చేసేందుకు మా హార్వర్డ్ ఎజుకేషన్ స్కూల్ కు నిర్వాహకుడు ప్రొఫెసర్ ఫెర్నాండో రీమర్స్ ఈ మేరకు ప్రవీణ్ కుమార్ కు లేఖ రాశారు.
ఈ విదార్థులు TSWREIS విధానాలను,బోధనా పద్ధతులను, బోధనేతర పద్ధతులను ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేస్తారు.
అట్టడుగునుంచి వచ్చిన వర్గాలకు అందరితో సమానంగా అవకాశాలిచ్చి, మెరుగైన విద్యను అందిస్తే వారు కూడా అన్ని రంగాలలలో ఎవరికీతీసిపోరని TSWREIS ఎలా నిరూపించిందో హార్వర్డ్ విద్యార్థులు పరిశీలిస్తారు.
ఇప్పటికే పలు దక్షిణాసియా దేశాల నిపుణులు వచ్చి TSWREIS లో నాన్ టీచింగ్ పద్ధతుల్లో విద్యార్థులలోని ప్రతిభను ఎలా వెతికితీస్తున్నదో పరిశీలించారు.
అన్నట్లు, ఎవరెస్టు పూర్ణ మీద 2017లోరాహుల్ బోస్ దర్శకత్వంలో ‘పూర్ణ ’ అనే బయోపిక్ కూడా వచ్చింది. దానికి కూడా జాతీయ అంతర్జాతీయ ప్రశంసలందాయి.
One thought on “హాట్సాఫ్ ప్రవీణ్ కుమార్, టి-రెసిడెన్షియల్ స్కూళ్ల మీద హార్వర్డ్ యూనివర్శిటీ రీసెర్చ్….”
One thought on “హాట్సాఫ్ ప్రవీణ్ కుమార్, టి-రెసిడెన్షియల్ స్కూళ్ల మీద హార్వర్డ్ యూనివర్శిటీ రీసెర్చ్….”
Comments are closed.