మాయమయిపోతున్నాడమ్మా మనిషన్న వాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు…నూటికో కూటికో ఒక్కడే ఒక్కడు యాడవున్నడో గాని కంటికి కనరాడు…
అందెశ్రీ రాసిని మహాద్భతమయిన పాట వీళ్లని చూస్తే గుర్తొస్తుంది.
ఆయన వెదికిన నూటికో కోటికో ఒక్కడే ఒక్కడూ…ఇలా కనిపిస్తూంటారు అరుదుగా…
ఈ ఫోటోలో ఉన్నవాళ్లిద్దరు ఎంబిఎ చదివారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ముంబాయిలోని … రైల్వే స్టేషన్ పక్కన వీళ్లిద్దరు చడీ చప్పుడు లేకుండా ఈ చిన్న టిఫిన్ స్టాల్ తెరిచారీ మధ్య. ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగునుంచి ఉదయం 10 గంటల దాకా టిఫిన్ అమ్ముతారు.
ఇందులో పోహ, ఉప్మ, పరొటా,ఇడ్లీ, టీ దొరుకుతాయి. రోజూ పొద్దునే నగరాలలో ఉద్యోగాలకోసం పరుగులు తీస్తుంటారు. అలాంటి వాళ్లలో చాలా మందికి ఇళ్ల దగ్గిర టిఫిన్ చేసుకుని తిని స్టేషన్ కు పరుగుతీసేంత టైం ఉండదు.
లేస్తూనే రోడ్డు న పడతారు. కనిపించేందేదో తినేస్తుంటారు. మళ్లీ పరుగు తీస్తుంటారు.
ఇలా పరుగులో ఉన్న దీపాలి భాటియా కంట పడింది ఈ చిన్న టిపిన్ సెంటర్ . కండివలి రైల్వే స్టేషన్ వెస్టుకు పరుగుతీస్తున్న ఆమెకు టిఫిన్ చేయాలనిపించింది.
స్టేషన్ పక్కే ఈ కొత్త కొట్టు కనిపించింది. టిఫిన్ చేస్తూ , సెంటర్ నడుపుతున్న వారిద్దరిని గమనించింది.చూసేందుకు చదువుకున్న కుటుంబం నుంచి వచ్చినట్లున్నారు. బాగా చూస్తే వాళ్ల మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలాగా కూడా ఉన్నారు. మరి టిఫిన్ సెంటర్ నడుపుతున్నారేంటి అని భాటియాకు అనిపించింది.
ఒకసారి వాళ్లని వాకబు చేసింది.వాళ్లు చెప్పింది విని ఆమె ఆవాక్కయింది.
వాళ్లిద్దరు (అశ్విని,షెనాయ్ షా) వాళ్ల ఇంటి వంట మనిషి కోసం ఈ టిఫిన్ సెంబర్ ఏర్పాటు చేశారు. వంట మనిషి భర్త జబ్బు పడ్డాడు . వైద్యానికి డబ్బు కావాలి. యాబై పై బడిన వయసులో వంట మనిషి ఎక్కడికెళ్లాలి? ఎవరిని బతిమాలాలి? ఎవరు డబ్బులిస్తారు? అందుకని నాలుగు డబ్బులు సంపాయించిపెట్టాలనుకున్నారు. అంతే టిఫిన్ సెంటర్ పెట్టేశారు. ఇదే అది.
ఈ దంపతుల మానవత్వం చూసి భాటియా చలించి పోయి తను చూసింది ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అది వైరలయింది. 15 వేల లైక్స్, 18వందల కామెంట్స్, 5300 షేర్లు వచ్చాయి.
సత్యేంద్ర యాదవ్ అనే క్రౌడ్ ఫండింగ్ కన్సల్టెంట్ తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన ఫోన్ నెంబర్ (8291007286) కూడా ఇచ్చారు. అదీ కథ.
ఇది కూడా చదవండి