HCA ఎన్నికల్లో అజారుద్దీన్ అఖండ విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల్లో  ప్రత్యర్థులను చిత్తు చేసి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ అఖండ విజయం సాధించారు.
ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ విజేతగా నిలవడమే కాదు,  వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రటరీ స్థానాలను  అజార్ ప్యానెల్ గెల్చుకుంది.
అజారుద్దీన్ కి 147 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థికంటే 74 ఓట్ల ఆధిక్యం సాధించారు.
మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపి  వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాష్ చంద్ జైన్ కి 73 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ప్రత్యర్థి దిలీప్ కుమార్ కి కేవలం 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
వైస్ ప్రెసిడెంట్ గా అజార్ ప్యానెల్ కి చెందిన జాన్ మనోజ్ కు
136 ఓట్లు పోలయ్యాయి.  49 ఓట్ల మెజార్టీ వచ్చింది. సెక్రెటరీ గా అజార్ ప్యానెల్ కే చెందిన విజయానంద్ 137 ఓట్లు సాధించి 75 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక జాయింట్ సెక్రటరీ గా అజార్ ప్యానెల్ కి చెందిన నరేష్ శర్మ విజయం 132 ఓట్లు వచ్చాయి. విజయం సాధించారు.