Skip to content
Monday, December 23, 2024
Trending Telugu News
Search
Search
English
TOP STORIES
Privacy Policy
Home
2019
September
26
గాంధీ గురించిన 10 అబ్బుర పరిచే విషయాలు… (గ్యాలరీ)
Features
TOP STORIES
గాంధీ గురించిన 10 అబ్బుర పరిచే విషయాలు… (గ్యాలరీ)
September 26, 2019
Trending News
గాంధీజీకి 13 సంవత్సరాలకే కస్తూర్బా మాకంజీతో పెళ్లయింది.నిజానికిది ఆయన ఏడోయేటనే నిర్ణయమయింది.వారికి నలుగురు కుమారులు.కస్తూర్బా74వ యేట పుణేలోని ఆగా ఖాన్ ప్యాలెస్ లో మరణించారు. ఆయన అక్కడ జైలులో ఉన్నందున కస్బుర్బా అక్కడికి మకాం మార్చారు.
చనిపోయేటపుడు ధరించిన ఉన్న దుస్తులతో పాట కొన్ని వస్తువులను మదురైలోని మహాత్మాగాంధీ మ్యూజియమ్ లో భద్రపరిచారు.
స్టీవ్ జాబ్స్ గాంధీ అభిమాని. ఆయన గుండ్రటి కళ్లద్దాలకు గాంధీయే స్ఫూర్తి
వూరూర ఉన్న చిన్న చిన్న రోడ్లు కాకుండా దేశంలో 53 ప్రధాన రోడ్లకు గాంధీజీ పేరుంది. బయట 48 దేశాలలో మహాత్మగాంధీ రోడ్లున్నాయి.
సౌతాఫ్రికాలో ఉన్నపుడు గాంధీజీ దర్బన్, ప్రిటోరియా, జొహాన్నెస్ బర్గ్ లో మూడు ఫుట్ బాల్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. వాటన్నింటి పేరు ‘పాసివ్ రెసిస్టర్స్ సాసర్ క్లబ్’
గాంధీజీ ఎపుడూ నిలకడగా లేరు. నిరంతరం నడుస్తూనే ఉన్నారు. రోజు 18 కి.మీ దాకా నడిచే వారు. అంటే జీవితకాలంలో ఆయన భూమిని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరం నడిచారు.
స్వాతంత్య్రపోరాటకాలంలో చాలాసార్లు అరెస్టు చేసిన, అయితే గాంధీ చనిపోయిన తర్వాత 21 సంవత్సరాలకు బ్రిటన్ గాంధీ మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
గాంధీజీ హింసామార్గం విడిచి అహింసా మార్గం పట్టేందుకు కారణం బోయెర్ వార్. ఆయన ఈ యుద్దంలో పాల్గొని అక్కడ జరిగే మారణ కాండ కళ్లారా చూశారు.
గాంధీజీ ఇంగ్లీష్ ఐరిష్ యాసలో మాట్లాడే వారు. దీనికి కారణం ఆయన టీచర్లలో ఒకరు ఐరిస్ దేశస్థుడు. గాంధీ మీద ఆయన ప్రభావం పడింది.
గాంధీజీ టాల్ స్టాయ్, ఐన్ స్టీన్ లతో పాటు హిట్లర్ కు కూడా ఉత్తరాలు రాశారు. ఇది హిట్లర్ కు ఆయన రాసిన ఉత్తరం
Photo: wikimedia
Post navigation
ట్యాంక్ బండ్ పక్కన నీరా రెస్టరంట్…మంచింగ్ తెలంగాణ రుచులు
ఈ రోజు చంద్రబాబు ఏమన్నారంటే…