గూగుల్ ఒక సూపర్ డూపర్ కంప్యూటర్ తయారుచేసింది. ఇపుడు అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్ లేవీ చేయలేని పనులను,లేదా వాటికి వందల సంవత్సరాలు పట్టే పనులను క్షణాల్లో చేసేంత స్పీడ్ తో వస్తున్న ఈ కొత్త తరం కంప్యూటర్ పేరు ‘క్వాంటమ్ కంప్యూటర్’. గూగుల్ కంప్యూటర్లను క్వాంటమ్ ఫిజిక్స్ లోకి తీసుకువెళ్తూ ఉంది. ఇపుడున్న కంప్యూటర్లేవీ క్వాంటమ్ ఫిజిక్స్ తో సంబంధం లేనివి.
ఇంతవరకు క్వాంటమ్ కంప్యూటర్ అనేది చర్చల్లో నే ఉంది తప్ప ఒక షేప్ తీసుకోలేదు. ఇలాంటపుడు హఠాత్తుగా గూగుల్ తయారుచేసిన క్వాంటమ్ కంప్యూటర్ గురించిన రీసెర్చ్ పేపర్ లీకయింది. అఫ్ కోర్స్, అది వెంటనే మాయమయింది. ఈ పేపర్‌ను గూగుల్ తో కలసి పనిచేస్తున్న నాసా (NASA) పొరపాటున తన వైబ్ సైట్ ntrs.nasa.gov లో అప్ లో డ్ చేసింది.
అయితే, కొద్ది రోజుల్లోనే అది మాయమయింది. కాని, ఈ రీసెర్చ్ పేపర్ అప్పటికే ఫార్చూన్ మ్యాగజైన్, ఫైనాన్సియల్ టైమ్స్ చేతిలో పడిపోయింది. క్వాంటమ్ కంప్యూటర్ తయారీ లో గూగుల్ ప్రపంచాధితపత్యం సాధించినట్లు ఈ రీసెర్చ్ పేపర్ గొప్పకు చెప్పుకుంది.
క్వాంటమ్ కంప్యూటరీ అనేది థియరిటికల్ మోడల్ గానే ఉంది. ఎక్కడా ఉనికి లో లేదు. అలాంటపుడు గూగుల్ రీసెర్చ్ పేపర్ ప్రత్యక్షం కావడంతో కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రపంచంలో భూకంపం వచ్చేసింది.
ఈ రీసెర్చ్ పేపర్ ప్రకారం, గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఇంతవరకు అసాధ్యమనిపించిన ఏన్నో మ్యాథమ్యాటికల్ ప్రాబ్లమ్స్ ను చిటికెలో సాల్వ్ చే యగలగుతుంది. ఇపుడు అందుబాటులో ఉన్నసూపర్ కంప్యూటర్ల కంటే చాలా చాలా చాలా చాలా వేగంగా ఇది సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రపంచంలోని అతి సూపర్ కంప్యూటర్ కంటే కూడా తన క్వాంటమ్ కంప్యూటర్ వూహించలేనంత ఫాస్ట్ అని గూగుల్ క్లెయిమ్ చేస్తున్నది.
ఈ రీసెర్చ్ పేపర్ మొదట ntrs.nasa.gov వెబ్ సైట్ ప్రత్యక్ష మయింది. దీనిని డెలీట్ చేసే లోపు Fortune డౌన్ లోడ్ చేసుకుంది.
రీసెర్చ్ పేపర్ ను నిపుణులతో అంచనా వేయించకముందే నాసా పొరపాటున పబ్లిష్ చేసింది. నిజానికి దీనిని పరిశీలించి అంచనావేసేందుకు నెలలుపడుతుంది.అలాంటిది వెబ్ సైట్ లో ప్రత్యక్షమయింది.
ఈ రీసెర్చ్ పేపర్ లో రాసిందంతా నిజమేనని సాంకేతిక నిపుణులు రుజువు చేస్తే గూగుల్ రీసెర్చ్ ‘క్వాంటమ్ సైన్స్’ లో ఒక మైలు రాయి అవుతుంది.
క్వాంటమ్ స్పీడ్ ను సాధించడం సాధ్యం కాదని, ఏదో తెలియని భౌతిక సూత్రం దానిని తప్పకుండా అడ్డుకుంటుందని ఇంతవరకు శాస్త్రవేత్తలను అనుకుంటూ వస్తున్నారు.
అయితే, ‘నిజప్రపంచంలో క్వాంటమ్ స్పీడ్ సాధించడమే సాధ్యమే. దీనిని ఏ అదృశ్య భౌతిక శక్తులు అడ్డుకోలేవు’ అని ఈ రీసెర్చ్ పేపర్ లో గూగుల్ పరిశోధకులు రాశారు.
కాలిఫోర్నియా యూనివర్శిటీ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త జాన్ మార్టినిస్ నాయకత్వంలో గూగుల్ పరిశోధకులు చాలా కాలంగా క్వాంటమ్ కంప్యూటర్ మీద పరిశోధనలు చేస్తూన్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ మూర్స్ సూత్రా (Moore’s Law)న్నిదాటేసి పోతుందని వాళ్లు చెబుతున్నారు. మూర్స్ సూత్రం ఏమిటో తెలుసుగాదా, ఇపుడున్న కంప్యూటర్ల మైక్రోచిప్ లోని ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతిరెండేళ్ల కొకసారి రెట్టింపవుతూ ఉంటుందనేది మూర్స్ లా.
క్వాంటమ్ కంప్యూటర్లు ఇపుడున్న కంప్యూటర్లను అన్నివిధాల ఆధిగమిస్తాయి. ఈ కొత్త ప్రాసెసర్ కు ఉన్న స్పీడ్ గురించి చెబుతూ ఒక కొన్ని రకాల మ్యాథమేటికల్ కాల్ క్యూలేషన్స్ ని క్వాంటమ్ కంప్యూటర్ 200 సెకన్లలో (మూడు నిమిషాలకటూ ఇటూ) చేసేస్తుంది. ఇదే ఇప్పటి IBM Summit సూపర్ కంప్యూటర్ చేయాలంటే 10 వేల సంవత్సరాలు పడుతుందని గూగుల్ రీసెర్చర్లు చెప్పారు. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమయిన కమర్షియల్ కంప్యూటర్ IBM Summit మాత్రమే. గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఇది అందుకోలేనంత ఎత్తుకు అధిగమించి పోతున్నది..
గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ సైకమోర్ (Sycamore) అని పిలుస్తున్నారు.
దీని పొటెన్సియల్ పవర్ 53 క్యూబిట్స్ (qubits : Quantum bits). నిజానికి 2018 మార్చి నెలలో గూగుల్ టీమ్ 72 క్యూబిట్స్ తో ఒక క్వాంటమ్ చిప్ తయారుచేసింది. దీనిని పేరు బ్రిజిల్ కోన్ (Bristlecone).
అయితే, తర్వాత ఈ పొటెన్సియల్ ను 53 క్యూబిట్స్ కు తగ్గించారు. క్వాంటమ్ కంప్యూటర్ లో ఏకకాలంలో ఫిజిక్స్, కెమిస్ట్రి సిమ్యులేషన్స్ కోసం వాడవచ్చు. ఇప్పటి కంప్యూటర్లలో ఇది సాధ్యం కాదు.
క్వాంట్ మ్ కంప్యూటర్ అందుబాటులోకి వస్తే కనివిని ఎరుగుని శాస్త్ర సాంకేతిక ఫలితాలను సాధించవచ్చని గూగుల్ టీమ్ చెబుతూఉంది.
వీటితో కొత్త ఔషధాలను,ఎరువులను,బ్యాటరీలను, సోలార్ ప్యానెల్స్ రూపొందించవచ్చు. వీటితో AI ఇంకా మెరుగుపర్చవచ్చు. ఒక పనిచేసేందుకు అవసరమయిన మార్గమేదో కొన్ని మిలియన్ల ఆప్షన్లను పరిశీలించి,ఒక మార్గాన్ని మనకు కచ్చితంగా క్వాంటమ్ కాంప్యూటేషన్ చెబుతుంది.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రూపొందించ్చు. ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోలనుకూడా అదే మెనేజ్ చేస్తుంది. మీరు శ్రమించాల్సిన పనిలేదు.
గూగుల్ రీసెర్చ్ పేపర్ గా బయటకు చక్కర్లు కొడుతున్న రీసెర్చ్ ప్లెయిన్ టెక్స్ట్ గా Pastebin లో కనిపిస్తున్నది, మీరు చూడవచ్చు.చదవవచ్చు