ఈ తెలుగు రిటైర్డు జడ్డి కోడలిని ఎలా హింసిస్తున్నాడో చూడండి…

జస్టిస్ నూతి రామ్మోహన్ రావు అనే పేరు విన్నారుగా. ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు జడ్డిగా ఉండే వారు. తర్వాత మద్రాసు హైకోర్టు జడ్జిగా పని చేసి రిటైరయ్యారు. ఆయన, భార్య, కుమారుడు కలసి వరకట్నం కోసం కోడలు సింధు శర్మ ను హింసించే వారని అరోపణలున్నాయి. దీనికి ఆయన మీద, కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదులయ్యాయి. ఇండియన్ పీనల్ కోడ్ , వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 498ఎ (భర్త, బంధువుల చేతిలో భార్య వేధింపులు), 323( ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 406(నమ్మకాన్ని వమ్ము చేయడం) కింద వారి మీద కేసులు నమోదయ్యాయి.
మాజీ జడ్జి, ఆయన భార్య, కుమారుడు కలసి ఎలాహింసించారో వెల్లడించే వీడియో ఫుటేజ్ ఇపుడు బయటకు వచ్చింది. వైరలయ్యింది. ఇపుడు జస్టిస్ నూతి రామ్మోహన్ రావు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఐపిసి 354 ( దాడిచేయడం, అత్యాచారం చేసేందుకు వత్తిడి తీసుకురావడం) 307( హత్యాయత్నం) ల కింద కేసులు పెట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసు ఈ నెల 23 న విచారణకు వస్తున్నది.

తనని శారీరకంగా మానసికంగా అత్తమామలు, భర్త వేధించారని సింధు శర్మ పెట్టిన కేసులకు ఈ వీడియో బలం చేకూర్చనుంది. ఈ సిసిటివి ఫుటేజ్ ను సింధు ఏప్రిల్ 20 న ఉ. 11 గంటలకు విడుదలచేసింది. మామ జస్టిస్ నూతి రామ్మెహన్ రావు, అత్త దుర్గ జయలక్ష్మి, భర్త నూతి వశిష్ట ఆమెమీద దాడిచేయడం వీడియోలో స్పష్టంగా ఉంది. డ్రాయింగ్ రూంలో ఏర్పాటుచేసిన కెమెరా ఈ సంఘటనలను రికార్డు చేసింది.
జస్టిస్ రామ్మోహన్ రావు ఆమెను లాగి సోఫాలో పడేసి, కుక్కడం ఇందులో కనిపిస్తుంది. మరొక వీడియోలో సింధును అర్థరాత్రి ఇంటినుంచి బయటకు గెంటేయడం, ఆమెను బయట ఉన్న కార్లోకి బలవంతంగా తోయడం కనిపిస్తుంది. కారు తర్వాత అపోలో
హాస్పటలకు వెళ్లిందని సింధు పోలీసులకు చెప్పింది.
కట్నం కోసం భర్త అత్త మామలు తనని హింసిస్తూ వస్తున్నారని, ఆరోజు ఇంట్లో పనిమనిషితో సహా తన మీద దాడి చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె శరీరంపైన గాయలున్నాయి. పెదవి చీరుకుపోయి ఉంది. ఏప్రిల్ 26 న ఆమె తల్లితండ్రుల ఇంటికి వెళ్లిపోయి అత్తమామల మీద, భర్త మీద కేసు పెట్టారు. తన పిచ్చి పట్టిందని ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని ఆమె చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో ఆమె భర్త ఇంటిముందు ధర్నా కూడా చేశారు. మొదట చిన్న కూతరు ను అమెకు అప్పగించినా, తర్వాత అతి కష్టం మీద పెద్ద కూతురును కూడా అప్పగించక తప్పలేదు.