ఆల్కహాల్ డోర్ డెలివరీ చెల్లదన్న కర్నాటక హైకోర్టు…
స్టార్టప్ కు ఎదురు దెబ్బ. దేశంలో చాలా వస్తువులు ఇపుడు డోర్ డెలివరీ అందుతున్నాయ్. అయితే, ఒక ముఖ్యమయిన సరుకు మాత్రం ఇంకా డోర్ డెలివరీ చిక్కడం లేదు. మందుబాబులకు అవధుల్లేని ఆనందం అందించేందుకు ప్రారంభించిన హిప్ బార్ (HipBar) యాప్ మూత పడింది. హిప్ బార్ ఇండియాలో ఆల్కహాల్ ను డోర్ డెలివరీ చేసేందుకు ప్రారంభమయిన తొలి యాప్. అయితే, కర్నాటక హైకోర్టు ఈ ఆన్ లైన్ ఆల్కహాల్ బుకింగ్ చెల్లదని తీర్పు చెప్పడంతో ఈ యాప్ పర్మనెంటుగా మూతపడింది. ఆల్కహాల్ డోర్ డెలివరీ కి లైసెన్స్ ఇచ్చేందుకు కర్నాటక ఎక్సయిజ్ యాక్ట్,1965లో అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది.
https://trendingtelugunews.com/aj-sekhar-reddy-of-demonetization-fame-back-in-ttd-board-as-special-invitee/
ఆన్ లైన్ ఆల్కహాల్ సేల్ ను నిషేధిస్తూ హైకోర్టుకు చెందిన జస్టిస్ సుజాతా తీర్పు నిస్తూ హిప్ బార్ వేసిన పిటిషన్ ను కొట్టి వేశారు.
‘అనుమానమే లేదు, మద్యం మానవజాతి ఆరోగ్యానికి హాని చేస్తుంది. మద్యాన్ని ఒక సామాజిక రుగ్మతగా చూస్తున్న కుటుంబ, సామాజిక దోరణులను విస్మరించడానికి వీల్లేదు.ఆన్ లైన్ అర్డర్ల ద్వారా మద్యం సరఫరా అయితే, యువత మీద ముఖ్యంగా మద్యవయోపరిమితిలోపున్నవారు దీని ఆకర్షణకు లోను కాకుండా కఠినంగా నియంత్రించడం కష్టమవుతుంది. పిటిషనర్ కంపెనీ ఈవ్యాపారం చేయడం మొదలుపెడితే మద్యం స్వీకరిస్తున్నవారి వయసును, మానసిక పరిపక్వత ను పర్యవేక్షించడం సాధ్యం కాదు,’ జస్టిస్ సుజాత పేర్కొన్నారు.
(Indisputably, liquor is deleterious to the health of mankind. The social stigma attached to it as far as the family and society are concerned cannot be lost sight of. Younger generation including children below the permissible age succumbing to this temptation of liquor consumption may not be stringently regulated through online orders. The eligibility of age and sound mind to receive and consume liquor is difficult to monitor with the trade carried out by the petitioner-company: Justice Sujatha)
హిప్ బార్ అనే స్టార్టప్ ను 2015లొ ఒక చెన్నై సంస్థ స్థాపించింది. మొదట బెంగళూరు, గోవా, పుదుచ్ఛేరికి చెందిన మహేలలో ఇది కార్యకలాపాలు ప్రారంభించింది. హిప్ బార్ యాప్ పనితీరు కర్నాకటలోని ఒక టివి న్యూస్ చానెల్ కంటపడింది. దీనితో ఆల్కహాల్ ఆన్ లైన్ వ్యాపారం వివాదాస్సదమయింది. 2018 నవంబర్ లో హిప్ బార్ వ్యాపారం మానేసింది. ఆ మరుసటి నెలలోనే ప్రభుత్వం లైసెన్స్ రద్దు చేసింది.
తన లైసెన్స్ ను ఎలాంటి షాకాజ్ నోటీ సు లేకుండా ఉపసంహరించుకున్నారని యాప్ స్థాపకుడు ప్రసన్న నటరాజన్ పేర్కొన్నారు. దీనితో హిప్ బార్ కర్నాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఎక్సయిజ్ శాఖ మార్గ దర్శక సూత్రాల ప్రకారం పని చేస్తున్నందున మాకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని యాప్ వాదించింది. అంతేకాదు, లీగల్ ఏజ్ కస్టమర్స్ కు మాత్రమే డెలివరీ చేస్తామని, తాము కేవలం డెలివరీ ఏజన్సీ మాత్రమేనని హిప్ బార్ వాదించింది.
హిప్ బార్ కేవలం లిక్కర్ డెలివరీ చేయడమే కాదు, పేమెంట్ వ్యాలెట్ గా కూడ పనిచేస్తూ వచ్చింది. రిజర్వు బ్యాంక్ ఈ యాప్ కు 2017లో Payments and Settlements Systems Act, 2007 కింద పేమెంట్ వ్యాలెట్ లైసెన్స్ కూడా ఇచ్చింది. ఇది సెప్టెంబర్ 31,2021 దాకా అమలులో ఉంటుంది.
రెగ్యులేటరీ నియమాలను కంపెనీ ఉల్లంఘించడంతో రిజర్వు బ్యాంక్ రు. 10.85లక్షల పెనాల్టీ కూడా విధించింది.