సెప్టెంబర్ నెల మొదలయి అపుడే నాలుగురోజులవుతూ ఉంది.ప్రతినెలలాగే సెప్టెంబర్ కూడా వస్తుంది, పోతుందని అనకుుంటున్నారా? అలా కాదు, ఈ సెప్టంర్ కు విశేషముంది.
మీరు గమనించారా, ఈ సెప్టెంబర్ నెల ఆదివారంతో మొదలయింది. అదే విశేషం. అదేమిటో ఇపుడు చూద్దాం.
ఏ నెలైనా సరే ఆదివారంతో మొదలయితే ఆ నెల పదమూడో తేదీ శుక్రవారం అవుతుంది. అంటే 2019 సెప్టెంబర్ నెల అదివారం తో మొదలయింది కాబట్టి సెప్టెంబర్ 13 వ తేదీ శుక్ర వారం.
ఇలా 13వ తేదీన వచ్చే శక్రవారాలు 2019 సంవత్సరలో కేవలం రెండే ఉంటాయి. రెండోది డిసెంబర్ 13న వస్తుంది.
ప్రతిక్యాలెండర్ సంవత్సరంలో ఇలాంటి ‘13 వ తేదీ శుక్రవారం’ ఒకటైనా ఉంటుంది. మాగ్జిమమ్ 3 కంటే ఎక్కువ వుండవు.
13వ తేదీ శుక్రవారం మంచిరోజు కాదని చాలా మంది అభిప్రాయపడతారు. ఆరోజంటే చాలా మందికి భయం. దాన్నుంచి వచ్చిందే శుక్రవారం భయం.దీన్నే Friggatriskaidekaphobia అంటారు.
చాలమంది, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, శుక్రవారం నాడు మంచిపనులు ప్రారంభించరు. పెళ్లి చేసుకోరు. ప్రయాణాలు ప్రారంభించరు.
సెప్టెంబర్ 13 శుక్రవారం తర్వాత 13 వారాలకు డిసెంబర్ 13 శుక్రవారం వస్తూ ఉంది. డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం తర్వాత 13 వారాలకు 2020 మార్చి లో మళ్లీ ‘13వ తేదీ శుక్రవారం’ వస్తుంది.
గతంలో ‘13వ తేదీ శుక్రవారం’ 2016 మే నెలలో వచ్చింది.
తర్వాత 2001 ఆగస్టు దాకా ‘13 వ తేదీ శుక్రవారం’ రాదు. 2015 లొ మూడు ‘ 13 వ తేదీ శుక్రవారాలు’ (ఫిబ్రవరి, మార్చ్, నవంబర్ ) వచ్చాయి. ఇలా మూడు ‘13వ తేదీ శుక్రవారం’లు రావాడానికి 2026 దాకా ఆగాలి.
ఇందులో సాధారణంగా అంకెల పునావృతమే తప్ప మరో విశేషం కనిపించదు. అయితే, 13వ తేదీ శుక్రవారం మంచిరోజు కాదనే భయం చాలా రోజులుగా ఉంది. క్రిష్టియానిటీలో శుక్రవారం బాగా అపకీర్తి పాలయింది. (అయితే, హిందూ సమాజంలో శుక్రవారం మంచిరోజు) ఆరోజు క్రీస్తుకు శిలువ వేశారని చెబుతారు.
డైనింగ్ టేబుల్ దగ్గిర 13 వ్యక్తికిస్థానమీయరు. ఎందుకంటే క్రీస్తును మోసం చేసిన జూదాస్ ఇస్కారియాట్ చివరి విందు (Last Supper)లో 13వ అతిధి. ఇంగ్లీష్ వాళ్ల Friday అనే మాట Firgga నుంచి వచ్చింది. Frigga స్కాండినేవియన్ల సంతానదేవత.
ఆ మధ్య వచ్చిన “Friday the 13th” అనే సినిమా వచ్చి friggatriskaidekaphobia ను బాగా ప్రచారం చేసింది.
2019 అనేది కామన్ ఇయర్ కాదు.ఈ సంవత్సరం మంగళవారం (Tuesday)తో మొదలయింది. 365 రోజులున్న కామన్ ఇయర్ Tuesday తో మొదలయితే సెప్టెంబర్ , డిసెంబర్ నెలలు తప్పనిసరిగా ఆదివారం తో మొదలవుతాయి.
ఇక ఆదివారం తో మొదలయ్యే ప్రతి నెలలో 13 వ తేదీ తప్పనిసరిగా శుక్రవారమే. చెక్ చేసుకోండి.
గతంలో కామన్ ఇయర్ అనేది Tuesday మొదలుకావడమనేది 2013లో జరిగింది. మళ్లీ ఇలాంటి సంవత్సరం 2030 మాత్రమే.
అలా కాకుండా ఒక లీప్ సంవత్సరం అంటే 366రోలున్న సంవత్సరం సోమవారంతో మొదలయినా కూడా సెపెంబర్ 13, డిసెంబర్ 13 శుక్రవారాలవుతాయి. ఇలాంటి లీప్ సంవత్సరం 2024.
21 శతాబ్దంలో (అంటే 2001 నుంచి 2100)మొదటి ‘సెప్టెంబర్-డిసెంబర్ 13 వ తేదీ శుక్రవారం’ ఎదురయింది 2002లో. అంటే లీప్ ఇయర్ వచ్చిన రెండు సంవత్సరాలకన్నమాట. అంటే లీప్ సంవత్సరం తర్వాత రెండేళ్లకు మొదలయ్యే ఏ క్యాలెండర్ సంవత్సరమయినా ఇలాంటి తేదీల పునరాగమనం ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అ పద్ధతి 11, 17, 28 . 2002+11= 2-13 2002+17= 2019 2002+28= 2030.
ఈ లెక్కన ఈ శతాబ్దంలో 2002, 2013,2019,2030, 2041, 2047, 2058,2069,2075,2086,2097 లో సెప్టెంబర్ , డిసెంబర్ 13 శుక్రవారం వస్తుంది.
ఇదే ’సెప్టెంబర్ 13, డిసెంబర్ 13 శుక్రవారం’ లీప్ ఇయర్ లో 28 సంవత్సరాల సైకిల్ అనుసరిస్తుంది. 2024 +28=2052; 2052+28=2080. అంటే లీప్ ఇయర్ ’సెప్టెంబర్ 13, డిసెంబర్ 13 శుక్రవారం’ ఈ శతాబ్దంలో కేవలం మూడు ( 2024,2052,2080) మాత్రమే అన్నాయన్నమాట.