ఇస్రో కంటే ముందే మూన్ వాక్, అధికారులకు చెమటలు పట్టించిన వీడియో

https://www.facebook.com/royalbaadal/videos/813090012418317/

ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ చంద్రుని మీద దిగేందుకు ఇంకా మూడు రోజుల టై ముంది. ఈ లాండింగ్ నుచూసేందుకు భారతీయులంతా ఆత్రంగా ఎదరుచూస్తున్న సమయంలో ఒక భారతీయుడి మూన్ వాక్ వీడియో సోషల్ మీడియా లో వైరలయింది.
ఈ వీడియో ప్రపంచమంతా తిరిగింది. రష్యా కు చెందిన ఆర్ టి.కామ్ కూడా భారతీయుడి మూన్ వాక్ వీడియో గురించి రాసింది.
ఈ వీడియోలో స్పేస్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి చంద్రుని మీద ఉన్న క్రేటర్ల మధ్య చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఈ స్పేస్ వాక్ వీడియోని సెప్టెంబర్ 2 తేదీన ఉదయం 6.55 పోస్టు చేశారు. ఇప్పటిదాకా ఈ స్పేస్ వాక్ వీడియోని 26 వేల మంది లైక్ చేశారు. 2500 కామెంట్స్ వచ్చాయి. 34 వేల షేర్స్ నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద యండమూరి వీరేంద్రనాథ్ అసంతృప్తి

సోషల్ మీడియాలో పకపకలు సృష్టించిన ఈ వీడియో బెంగుళూరు నగర పాలక సంస్థలో కలకలం సృష్టించింది.
ఎందుకంటే ఈమూన్ వాక్ సాగింది బెంగుళూరు రోడ్ల మీద, చంద్రుని మీద క్రేటర్ల లాగా కనిపిస్తున్నవి రోడ్ల మీద గుంతలు.
బెంగుళూరు రోడ్ల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చేందుకు బాదల్ నంజుందస్వామి అనే కళాకారుడు ఈ మూన్ వాక్ సృష్టించారు. అంతే సంచలన వార్త అయిపోయింది.

ఈ సెప్టెంబర్ సండేతో మొదలుయింది, దీని వెనక ఉన్నకథ తెలుసా!

ఈ మూన్ వాక్ కు నంజుంద స్వామి పూర్ణ చంద్ర మైసూర్ అనే మరొక నటుడి సహాయం తీసుకున్నారు. మూన్ వాక్ చేసింది మైసూరే.
గత శనివారం రాత్రి పది గంటలపుడు సిల్వర్ కలర్ స్పేస్ షూట్ ధరించి మైసూర్ ‘చంద్రుడి ఉపరితలం’ మీద మూన్ వాక్ మొదలుపెట్టారు.
మూన్ వాక్ ని మొబైల్ లో నుంచి వీడియో చిత్రీకరించారు. ఒక లోకల్ కాస్ట్యూమ్ డిజైనర్ తో ఈ స్పేస్ షూట్ కుట్టించారు. కుట్టుకూలితో సహా మొత్తం మూన్ వాక్ చేయడానికి రు. 8,000 ఖర్చయినట్లు నంజుందస్వామి చెప్పారు.
ఇది బెంగుళూరు నగర పాలక సంస్థ పనితీరు మీద ఒక వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడం నెటిజెన్స్ నంజుంద స్వామిని ప్రశసించారు. దీనిని చూడగానే ఇస్రో ముందుగా ఒక మనిషిని మూన్ మీదకు పంపించిందేమోనని అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఇది మన బెంగుళూరు రోడ్లు, బిబిఎంసికి,కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

ఇండియాను తాకుతున్న హాంకాంగ్ నిరసన సెగలు

నగర పాలక సంస్థ పాలనా తీరు మీద ఇలాంటి సాంస్కృతిక దాడి చేయడం నంజుంద స్వామికి కొత్త కాదు. 2015లో ఇలాగే రోడ్లమీద గుంతల పరిస్థితి ఎలా వుందో చూపేందుకు ఒక గుంతలోని నీళ్లలో పే..ద్ద మొసలి ని (బొమ్మ) నగర వాసులు అవాక్కయ్యేలా చేశారు.
అధికార్లను పరిగెత్తించిన వీడియో…
మూన్ వాక్ సృష్టించిన కలకలంతో బెంగుళూరు నగర పాలక సంస్థ అధికారులు రిపేర్లు చేసేందుకు పరుగులు పెట్టారు. వెంటనే రోడ్ల మీద గుంతలు పూడ్చడటం మొదలుపెట్టారు. దీనికి నంజుంద స్వామి ట్విట్లర్ లో ధన్యవాదాలు తెలిపారు.