మారుతి కార్ల ఉత్పత్తి 34 శాతం కట్, సంక్షోభం మంటలు

ఆర్థిక వ్యవస్థ బలహీన పడటంతో, అమ్మకాలు పడిపోవడంతో మారుతి సుజుకి ఇండియా కార్ల కంపెనీని ఉత్తత్తిని బాగా తగ్గించేసింది. ప్రతినెలా కంపెనీ కార్ల ఉత్తత్తిని తగ్గిస్తూ ఉంది. ఇలా తగ్గించడం వరసగా ఇది ఏడోసారి.
ఆగస్టు నెలలో 33.99 శాతం ఉత్పత్తిని తగ్గించేసింది. దేశంలో మారుతి అతిపెద్ద కార్లతయారీ కంపెనీ. గత ఏడాది ఆగస్టు నెలలో 1,68,725 యూనిట్లను తయారుచేస్తే ఈ సారి కేవలం 1, 11,370 యూనిట్లనే తయారుచేసింది. ఈ విషయాన్ని సోమవారం నాడు కంపెనీ బాంబే స్టాక్ ఎక్చేంజ్ (బిఎస్ ఇ)కి తెలియచేసింది.
ప్యాసెంజర్ వాహనాలకు సంబంధించి ఇది గత ఏడాది కంటే 33.67 శాతం తక్కువ. మిని, అల్టో, న్యూ వ్యాగన్ ఆర్, సెలిరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ల ఉత్పత్తి 80,909 మాత్రమే.గత ఏడాది ఆగస్టు ఈ రకం వాహనాల ఉత్పత్తి 1,22,824 యూనిట్లు. అంటే 34.1 శాతం ఉత్పత్తి పడిపోయింది.
ఇక యుటిలిటి వాహనాల అంటే వితారా బ్రిజా, ఎర్టిగా, ఎస్ క్రాస్ వంటి వాహనాల ఉత్పత్తి 34.5 శాతం తగ్గిపోయింది. 23,176 యూనిట్లు ఉండాల్సిన ఉత్పత్తి ఈ ఆగస్టులో కేవలం 15,099 యూనిట్లు మాత్రమే.
మిడ్ సైజ్ సియాజ్ ల ఉత్పత్తి గత ఏడాడి ఆగస్టులో 6,149 ఉంటే, ఈ ఆగస్టు లో ఇది 2,285కు పడిపోయింది. సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ ఉత్పత్తిని 2,565 నుంచి 1,156కు పడిపోయింది. కంపెనీ సేల్స్ 33 శాతం పడిపోయిందని కంపెనీ ఆదివారం నాడు ప్రకటిచింది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/ys-rajasekhar-reddys-contribution-to-rayalaseema/