కరువు జిల్లా గాపేరున్న అనంతపురం జిల్లా మెల్లిగా అంతర్జాతీయ క్రీడారంగంలో తళుక్కున మెరియబోతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో క్రీడాశిక్షణ ఇవ్వబోతున్నారు. నిజానికి ఇప్పటికే ఇది మొదలయింది. ఇపుడు జిల్లాలో గగన్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నారు.
అనంతపురానికిది పెద్ద శుభవార్త. ఎందుకంటే, నిన్న గగన్ నారంగ్ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు.
అక్కడే జిల్లాకు చెందిన రాయలసీమ డెవెలప్ మెంట్ ట్రస్టు డైరెక్టర్ మాంకో ఫెరర్ కుడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు స్వీకరించారు. గగన్ కూడా ఈ అవార్డు స్వీకరించేందుకు వచ్చారు.
ఇది కూడా చదవండి
‘నైక్’ స్పోర్ట్స్ షూ గురించి మీకీ విషయాలు తెలుసా?
జిల్లాలో గ్రామీణ యవకులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు మాంకో బాగా కృషి చేస్తున్నారు. ఆర్ డి టి సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. ఈ సంస్థ జిల్లాలోని కరువు ప్రాంత ప్రజలకు ఎంత అండగా ఉండిందో అందరికి తెలుసు. 50 సంవత్సరాల కిందట ఈ సంస్థను ఫాదర్ ఫెరర్ స్థాపించారు.
ఆర్ డి టి 50 సంవత్సాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ (ఎఎస్ ఎ) నిస్థాపించార. ఈ సంస్థ జిల్లాలో 90 సెంటర్లలో 11వేల మంది యువకులకు హాకీ, ఫుట్ బాల్, క్రికెట్, జోడో, ఖోఖో ,కబడ్డిలలో శిక్షణ ఇస్తూ ఉంది. ఇందులో 45 శాతం మంది బాలికలున్నారన్నది విశేషం. వీళ్లంతా బడుగు వర్గాల ప్రజలు.
బంగారు గని తవ్వడం మొదలుపెడితే, ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఆర్ డి టి కూడా తొందర్లోనే ఈ గ్రామీణ విద్యార్థుల నుంచి బంగారు పతకాలు తీసుకురానుంది.
విశేషమేమిటంటే, అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ కలసిపనిచేసేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ముందుకువచ్చాయి. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చకున్నాయి. వాటిలో ప్రో స్పోర్ట్ డెవెలప్ మెంట్ (ఇండయా),మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎజుకేషన్, స్పెయిన్ కు చెందిన లా లీగా ఫౌండేషన్, లా లీగా విమెన్, నెదర్లాండ్స్ కు చెందిన వన్ మిలియన్ హాకీ లెగ్స్, స్పెయిన్ కు చెందిన మరొక సంస్థ స్టిక్ ఫర్ ఇండియాఉన్నాయి.
గత రెండు సంవత్సారాలో 20 కమ్యూనిటీ మండల్ ఫుట్ బాల్ క్లబ్స్ ను ప్రారంభించి2074 మందికి శిక్షణ ఇస్తున్నది. ఈ వరవడికి ఇపుడు గగన్ అకాడమీ తోడవుతున్నది.
గగన్ అకాడమీ అంటే…
గగన్ నారంగ్ పేరు విన్నారుగా. విశ్వ విఖ్యాత భారతీయ షూటర్. అతని కుటుంబం హర్యానా పానిపట్ కు చెందినది. అయితే, గగన్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అందుకేఆయన చదువంతా హైదరాబాద్ లో సాగింది.
గీతాంజలి సీనియర్ స్కూల్ లో చదివాక, ఉస్మానియా నుంచి ఆయన కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. 1997లో తండ్రి భీమ్ సేన్ నారంగ్ ఒక ఎయిర్ గన్ ను కానుకగా ఇవ్వడంతో గగన్ అటెన్షన్ షూటింగ్ వైపు మళ్లింది. ఇంటివెనక పెరటిలోనే ఆయన షూటింగ్ శిక్షణ మొదలయింది.
షూటింగ్ ప్రపంచ రికార్డు స్కోర్ 600 ను రెండు సార్లు అధిగమించడంతో ‘ది 600 ఎక్స్ ప్రెస్ ’ అనే పేరొచ్చింది. 2012 లండన్ ఒలిపింక్స్ కు క్వాలిఫై అయిన తొలి భారతీయుడాయనే. అపుడు బ్రాంజ్ సాధించారు. 2010లో జరిగిన కామన్ వెల్తు గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నాడు. అపుడే ఆయనకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది.
తర్వాత ఎషియన్ గేమ్స్ లో రెండు సిల్వర్ పతకాలు గెల్చుకున్నాడు. దీనితో ఆయన ఇండియాలో స్టార్ అయిపోయారు, తనకు ఇంత కీర్తి సంపద తెచ్చిపెట్టినందుకు తానూ దేశానికికేదయినా చేయాలనే ఉద్దేశంతో షూటింగ్ యువకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక శిక్షణా సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
గన్ ఫర్ గ్లోరీ (Gun for Glory:GFG) ధీమ్ తో ఆయన గగన్ అకాడమీ ని 2011లో పుణే కేంద్రంగా స్థాపించారు. ఆ ఏడాదే ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. గగన్ అకాడమీకి ఇపుడు 15 శాఖలున్నాయి. ఇపుడు ఈ జాబితాకు అనంతపురం తోడువుతున్నది.
గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ (గగన్ అకాడమీ) గగన్ నారంగ్ స్పోర్ట్స్ ఫైండేషన్ తరుఫున ఏర్పాటుచేశారు.పుణే ఛత్రపతి శివాజీ స్టేడియం లో అకాడమీ ఏర్పాటయింది. ఇక్కడ అంతర్జాతయ ప్రమాణాలతో వసతులుంటాయి. కోచింగ్ ఉంటుంది. స్కాలర్ షిప్ వచ్చే వాళ్లతోపాటు టాలెంట్ ఉన్న వారికి ఫీజు సబ్సడీ ఉంటుంది. కోర్సుకాలంలో అవసరమయిన మెటీరియల్ మొత్తం అకాడమీయే అందిస్తుంది.
ఈ కోర్సులో ధియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి.పేరుమోసిన భారతీయ కోచెసే కాకుండావిదేశీ నిపుణులు కూడా ఈ సంస్థకు వచ్చి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ సంస్థ దాదాపు వంద మందికి పైగా చాంపియన్లు తయారుచేసింది. ఈ సంస్థకుహైదరాబాద్ సికిందరబాద్ లలో రెండు శాఖ లున్నాయి. ఇలాంటి సంస్థ శాఖ అనంతపురానికి వస్తున్నది.
(photo DDNews)