Alarming News: 5 శాతానికి పడిపోయిన జిడిపి

భారత ఆర్థిక వ్యవస్థ ఖాయిలా పడుతూ ఉంది.
జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ) పెరుగుదల ఆరేళ్ల స్థాయికి పడిపోయింది.ఇది చాలా ఆందోళన కలిగించేవిషయం.
ఎప్రిల్-జూన్ క్వార్టర్ కు సంబంధించి డిజిపి 5 శాతానికి పడిపోయింది. అంతకు ముందు క్వార్టర్ లో అంటే జనవరి జనవరి – మార్చి లో ఇది 5.8 శాతం ఉండింది.
అదే 2018 సెకండర్ క్వార్టర్ లో 8 శాతం ఉండింది. గత అయిదు క్వార్టర్ల నుంచి వరుసగా  ఇలా పడిపోతూ ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ పరిస్థితి ఎపుడో 2013 లో ఎదురయింది. అపుడు జిడిపి 4.3 శాతంకు దిగజారింది.
ఇపుడు కార్ల దగ్గిర నుంచి బిస్కట్ల దాకా అన్ని రకాల గూడ్స్ అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగాలు టపటప రాలిపోతున్నాయి. చాలా పరిశ్రమలు ఉద్యోగాల కోత విధించబోతున్నాయి.
వినియోగదారులనుంచి డిమాండ్ లేకపోవడం, ప్రయివేటు పెట్టబడులు ఆశించినంత రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతూ ఉందని నిపుణులు చెబుతున్నారు.
జిడిపి గ్రోత్ ఏ ఏడాది మొదటి ఆరునెలల్లో 5.8 శాతం నుంచి 6.6 శాతం మధ్యఉంటుందని ఆర్ బిఐ ప్రకటించింది. తీరా చూస్తే అయిదు శాతానికి పడిపోయింది.

(ఫోటో Realreport సౌజన్యం)

ఇది కూడా చదవండి 

https://trendingtelugunews.com/dismal-economic-scene-economic-slowdown/