ఈ నంద్యాలలో రోజు జరిగిన రాయలసీమ సాగునీటి సాధన సమితి విలేకరుల సమావేశం విశేషాలు
*అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపండి
* శ్రీబాగ్ ఒడంబడికను అమలు పరచండి
*రాయలసీమలో రాజధాని/ హైకోర్టు ఏర్పాటు చెయ్యండి
*కృష్ణ తుంగభద్ర నీటిని రాయలసీమకే కేటాయించండి
భారత దేశంలో ప్రప్రధమంగా బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాందిపలికి, తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 న సాధించుకున్న విషయం విదితమే.
ఇలాంటి చారిత్రక సంఘటనను సాధించుకున్న అక్టోబర్ 1 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించేలాగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతం వివక్షకు గురి అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు బీజం పడింది. ఈ ఉద్యమంలో తొలి విజయం 1926 లో ఆంధ్రకు ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థానంతో కలిగింది. రాయలసీమలోని అనంతపురంలో ఏర్పాటు చేయవలసిన విశ్వవిద్యాలయంను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో రాయలసీమ వారు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి దూరమయ్యారు.
రాయలసీమ జిల్లాల సహకారం లేనిదే ఆంధ్ర రాష్ట్ర సాధన జరిగిందని భావించిన ఆంధ్ర మహాసభ పెద్దలు, నూతన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని “శ్రీబాగ్ ఒడంబడికను” నవంబర్ 17, 1937 న చేయడం జరిగింది.
శ్రీబాగ్ ఒడంబడికలో కీలకమైన అంశాలు రాజధాని/ హైకోర్టు ను రాయలసీమ లో ఏర్పాటు చెయ్యడం, కృష్ణా తుంగభద్ర జలాలను రాయలసీమ సంపూర్ణ అవసరాల కోసం వినియోగించడం. ఈ ఒడంబడిక నేపధ్యంలో రాయలసీమ అభివృద్ధికి తెలుగు రాష్ట్రంలో ఎలాంటి వివక్ష ఉండదని భావించి రాయలసీమ ప్రజలు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఈక్రమంలో రాయలసీమ జిల్లాల సంపూర్ణ సహకారంతో, కోస్తా జిల్లాల భాగస్వామ్యంతో జరిగిన అనేక కార్యక్రమాల వలన తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953 న ఆవిర్భవించింది.
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు కొనసాగింది. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో జతకలవడంతో 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి 2014లో విడిపోవడంతో 1953 లో సాదించికున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నది.
ఇది కూడా చదవండి : మీ రైలు టికెట్ ను మరొకరికి బదిలీ చేయవచ్చా?
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అక్టోబర్ 1 న జరపడం, తెలుగు జాతి భాష ప్రయుక్త రాష్ట్ర సాధనకు కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 1 వ తేదిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించేలాగా, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందటానికి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ సమావేశంలో బొజ్జా దశరథ రామి రెడ్డి, వై ఎన్ రెడ్డి, ఎర్వ రామచంద్ర రెడ్డి, సౌధాగర్ కాసిం మియా, మహేశ్వరి రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, వెంకటసుబ్బయ్య, బాస్కర రెడ్డి, ఎం వి రమణారెడ్డి, సుధాకర్ రావు, కృష్ణా మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/coastal-andhra-farmers-leader-yerneni-says-rayalaseema-projects-are-neglected-after-ysr-death/