మీ రైలు టికెట్ ను మరొకరి పేరుకు బదిలీ చేయవచ్చా?

మీ కన్ఫర్మ్ డు  రైలు టికెట్ ను మరొకరి పేర బదిలీ చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. ఆన్ లైన్ టికెటయినా ఆఫ్ లైన్ టికెట్టయినా సరే మీరు కొన్ని పరిమితులలకు లోబడి మరొకరికి బదిలీ చేయవచ్చు. అయిదు సందర్భాలలో కన్ఫర్మ్ డు టికెట్ ను మరొకరికి బదిలీ చేసేందుకు రైల్వే శాఖ అనుమతించింది
1. ధృవీకరించబడిన రైల్వే టికెట్ మీద ఏదైనా కారణాన ప్రయాణం చేయలేని పక్షంలో మీరు ఆటికెట్ ను తండ్రి, తల్లి, భార్య , తమ్ముళ్లు, సంతానానికి బదిలీ చేయవచ్చు. అయితే, దీనికి ట్రెయిన్ కదలడానికి 24 గంటల ముందు రైల్వే వారికి అభ్యర్థన అందివ్వాలి.
2. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే, మీరు విధులమీద ప్రయాణం చేయాలనుకున్నా,  ఏదయినా కారణాన ప్రయాణం రద్దు చేసుకుంటే టికెట్ ను మరొక ఉద్యోగి పేర బదిలీచేయవచ్చు.
3. ఈ సౌకర్యం విద్యార్థులకూ పొడిగించారు. అయితే, విద్యాసంస్థ అధినేత 48 గంటలలోపు టికెట్ మరొక విద్యార్థి పేరు మీద మార్చాలని సంబంధిత రైల్వే అధికారికి అభ్యర్థన లేఖ రాయల్సి ఉంటుంది.
4. ఇదే విధంగా పెళ్లి పార్టీలలో ఎవరైనా సభ్యుడు రాలేని పక్షం అతని టికెట్ ను మరొకరికి బదిలీ చేయవచ్చు. దీనికి పెళ్లిపార్టీ పెద్ద 48 గంటల ముందు ఆ టికెట్ ను మరొకరి పేర బదిలీ చేయాలని రైల్వే అధికారికి అభర్థన పెట్టుకోవచ్చు.
5. ఇదే విధంగా ఎన్ సిసి విద్యార్తులు కూడా టికెట్ బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ పై అధికారి మరొక క్యాడెట్ ను మాత్రమే రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి 24 గంటల లోపు అభ్యర్థన పంపాలి.
పైన పేర్కొన్న వాటిలో 3,4, 5 సందర్భాలలో టికెట్ బదిలీ కేవలం 10 శాతం టికెట్లకే వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ప్రయాణపు పార్టీలో 60 మంది సభ్యులుంటే కేవలం ఆరు టికెట్లను మాత్రమే బదిలీ చేస్తారు.
టికెట్ బదిలీ కోసం టికెట్ ఉన్న వ్యక్తి స్టేషన్ మేనేజర్ కు లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ కు లేఖ సమర్పించాల్సి ఉంటుంది. ఎవరిపేరు మీద టికెట్ ను బదిలీ చేయాలనుకుంటున్నారో అతని ఐడి ప్రూఫ్ (రేషన్ కార్డు,వోటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్ బుక్ లాంటివి) సమర్పించాల్సి ఉంటుంది. అంతే సింపుల్.