వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని వైసిపి ప్రభుత్వం ఇళ్లను ముంచే పనిలో మునిగిపోయి ఉండటమేనని ప్రతిపక్ష నాయకుడ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఇపుడువిజయవాడ దగ్గిర కృష్ణా వరదలు సహజమయినవి కావని, అవి జగన్ ప్రభుత్వం సృష్టించిన కుట్ర అని ఆయన చెప్పారు.
‘ వరద నీరు వస్తున్నది విషయం తెలిశాక ఏ ప్రభుత్వమయిన ప్రాజక్టుల నుంచి నీటిని విడుదల చేయాలి. అయితే, వరదల్లో నా ఇంటిని ముంచేందుకుకుట్ర చేశారు. దీనికోసం నీటిని ఆపారు. ఇక ఆప లేకపోయినపుడు విడుదల చేశారు. అయితే, నా ఇల్లు మునగలేదు.అయితే, పేదల ఇళ్లు మునిగాయి. పేదల ఇళ్లు మునిగిపోయి ఉంటే, వాళ్లకి సాయం చేయడం మానేసి మంత్రులంతా నా ఇల్లు మునిగిందా లేదా అని నా ఇంటి చుట్టు తిరుగుతున్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా మంత్రులంతా నా ఇల్లు ముంచే పనిలో పడ్డారు,’ ఆని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కనీసం ఈ సమయంలో అన్న క్యాంటీన్లు ఉండి ఉంంటే వారికి సహాయంగా ఉండేదాని, వాటిని కూడా లేకుండా చేశారని ఆయన విమర్శించారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజలకు భోజన సదుపాయాలు కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
ముంపునకు గురైన గీతానగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్, ప్రాంతాలలో పర్యటించి వరదబాధితులను పరామర్శించి మాట్లాడారు. మా ఇల్లు ను ముంచబోయి మీ ఇళ్లన్ని ముంచారని ఆయన బాధితులతో అన్నారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే…
“ఎన్ని కుట్ర లు చేసినా నా ఇల్లు మునగలేదని బాధ పడుతున్నారు.డ్రీన్ కెమెరా లతో వీడియో తీయవచ్చు… బాంబులు కూడా వేయవచ్చు.అక్కడ ఏమయినా జరగవచ్చు. సిఎం ఇంటిలో కూర్చున్నఒక వ్యక్తి అపరిచిత వ్యక్తులను నా ఇంటిమీదకు పంపారు. నాకు ఎటువంటి భయం లేదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతో నా ప్రయాణం. ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ పెట్టుకుని కుట్రతో ఒకేసారి వదిలేశారు. పేదల ఇళ్లన్నీ మునగడం చూస్తే చాలా బాధగా ఉంది. ప్రభుత్వం కనీసం అన్నం కూడా పెట్టకుండా మిమ్మలను వదిలేసింది. మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపి కేశినేని నానిలు సొంత ఖర్చుతో భోజనాలు పెట్టారు.నా ఇల్లు మునిగితే నాకు, నా ఇంటి ఓనర్ కు నష్టం. నా ఇల్లు మునగాలని మంత్రులు కు అంత అత్యుత్సాహం ఎందుకో? నన్ను ఖాళీ చేయించాలనే కుట్రతో మిమ్మలను ఖాళీచేయించాలనిచూస్తున్నారు. “