విజయవాడ: ప్రకాశం బ్యారేజి కి భారీగా కృష్ణా వరద నీరు చేరుతున్నది. పులిచింతల నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు 6 అడుగులు ఎత్తి సముద్రం లోకి 4.5 లక్షల క్యూసెక్కుల కృష్ణ వరద నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం లంక గ్రామాలు లో ప్రజలను అప్రమత్తం చేశారు. మరి కాసేపట్లో ప్రకాశం బ్యారేజి శనీశ్వరాలయం దగ్గర నుండి మంత్రులు కన్నబాబు,వెల్లంపల్లి శ్రీనివాసరావు ,జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఇరిగేషన్ అధికారులు తో కలది వరద ఉదృతిని పరిశీలిస్తున్నారు.
నామినేషన్ వేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు
అమరావతి: ఎపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ లు దాఖలు చేయనున్న వైసిపి అభ్యర్దులు. వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ వేస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి లోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో వారు నామినేషన్లు వేస్తారు.
FLASH ISRO successfully carries out final orbit raising manoeuvre of Chandrayaan2 spacecraft.
యార్లగడ్డ కు అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి
పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. యార్లగడ్డ గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చంద్రబాబుకు బాగా వ్యతిరేకి. ఆయనకు వ్యతిరేకంగా ఎపుడూ పనిచేస్తూ వచ్చారు. దీనికోసమే ఆయన వైఎస్ ఆర్ కు దగ్గిరయ్యారు. ఇదే ఆయనను మళ్లీ జగన్ దగ్గిరకు చేర్చింది. ఆయన నందమూరి హరికృష్ణకి సన్నిహితులు.