మాజీ మంత్రి హరీష్ రావు పాలిటిక్స్ లో చాలా మార్పు వచ్చింది. ఆయన హాట్ హాట్ స్టేట్ పాలిటిక్స్ నుంచి కొద్దిగా దూరంగా జరిగినట్లు అనిపిస్తుంది. నియోజకవర్గానికి, ప్రజలకు, ముఖ్యంగా యువకులకు బాగా దగ్గిరయ్యారు.
ఈ మధ్య ఆయన దగ్గిర నుంచి వాడివాడి వేడివేడి పొలిటికల్ స్టేట్ మెంట్లు బాగా తగ్గిపోయాయి. తెలంగాణ పాలిటిక్స్ లో యువతరంలో ప్రతిభావంతమయి రాజకీయ ఉపన్యాసకుల్లో ముందు చెప్పుకోవలసిన పేరు హరీష్ రావుది.
ఆయన ఒకసమస్యమీద మాట్లాడినా, ప్రకటన చేసినా, ఎవరికైనా ఎదురు జవాబిచ్చినా అందులో చాలా పస ఉంటుంది. కన్విన్సింగ్ గా ఒక వాదన వినిపించడంలో ఆయన తో సమానులు అరుదు. అయితే, ఇటీవల ఈ హాటాట్ పాలిటిక్స్ నుంచి ఆయన దూరం జరిగారనిపిస్తుంది. ఎక్కువ సమయంలో ఆయన జనం మధ్య గడుపుతున్నారు. టిఆర్ఎస్ -2 గవర్నెమెంటులో హరీష్ రావుకు రోల్ లేకపోవడం ఒక విధంగాలోటేఅయినా అది నియోజకవర్గానికి చాలా మేలు చేస్తున్నది.
నియోజవవర్గాన్ని బాగు చేయడం, గ్రామాలను బాగు చేయడం, యువకులను సోషల్ మీడియా అలవాటు మాన్పించడం… ఇలా కూల్ గా ఆయన పోషల్ వర్క్ లోకి మారి సైలెంట్ గా పనిచేసుకుపోతున్నారు.
గత కొద్ది రోజులుగా ఆయన కార్యక్రమాలను గమనిస్తే ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన మనుషుల అంతిమ యాత్ర గౌరవ ప్రదంగా సాగేందుకు ఏంచేయాలనే దాని మీద దృష్టి నిలిపారు. చిన్న విషయం, చాలా గొప్పవిషయం ఇది.
దీనికి ఆయన తన నియోజకవర్గంలోని గుర్రాలగొంది గ్రామాన్ని ఆదర్శగ్రామం చేయాలనుకున్నారు.
ఆయన పిలుపునకు గ్రామం స్పందించింది. రాష్ట్రంలో అలాంటి తొలి గ్రామంగా గుర్రాల గొందిని అయింది.
గుర్రాల గొంది సర్పంచ్ అంజనేయులు ముందుకు రావడం తో హరీష్ రావు అంతిమ సంస్కారాలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమం మొదలుపెట్టారు.
సర్పంచ్ తో పాటు పలువురు ముందు కు వచ్చి దాదాపు 8లక్షల వరకు విరాళాలు ఇచ్చి ఉచిత దహన సంస్కారానికి ఊతం ఇచ్చారు.
గ్రామంలో నిన్న, శనివారం నాడు, 85 సం.ల కంకణాల చంద్రవ్వ మృతి చెందగా గ్రామ సర్పంచ్ , పాలకవర్గం గ్రామ పంచాయతీ నుండే దహన సంస్కారాలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ అంజనేయులు స్వయంగా పాడె మోసి అంతిమ యాత్ర గౌరప్రదంగా ముగిసేలా చూశారు. తెలంగాణాలో గుర్రాల గొంది ఈ బాటలో నడుస్తున్న తొలిగ్రామం అయింది.
మొన్నామధ్య “మన సొసైటీ- మన విలేజ్” అంటూ యువతలో పరివర్తన తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చేస్తున్న ప్రసంగాల్లో యుతకులనుద్దేశించే ఎక్కువగా మాట్లాడుతున్నారు.
గ్రామ స్వరూపాన్ని మార్చడంలో యువత ముందుండాలి, వారిలో మార్పురావాలి, అది సమాజంలో మార్పు వైపు మళ్లాలి అని గట్టిగా చెబుతున్నారు.
ఇటీవల యువతరం ఎక్కువగా మద్యం, స్మార్ట్ ఫోన్‌ల వాడకం వంటివాటికి ఎడిక్ట్ అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జీవితాలకు, సమాజానికి ఎంతో విలువైన సమయాన్ని పనికిరాని వ్యాపకాలకు బలిచేస్తున్న విషయాన్ని ఆయన యువకులకు గుర్తు చేస్తున్నారు
.
‘ఫోన్ ఎక్కువగా వాడటం అనేది ఈ రోజుల్లో యువతలో శ్రుతిమించుతోంది. సోషల్ మీడియాలో పనికిరాని, మన విజ్ఞానానికి, అభివృద్ధికి ఉపయోగపడని అంశాలపై ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారు. అది సమాజానికి నష్టం కలిగిస్తుందంటూ,’ అని హరీశ్‌రావు చెబుతున్నారు.
మెడికల్, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ విద్యార్థులతో ఆయన భేటీ అవుతున్నారు. గ్రామాల్లో యువత సాంఘిక కార్యక్రమాల వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు.
తమ తమ గ్రామాలలోవారానికొక ఒకరోజు శ్రమదానం చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కృషిచేయాలని, మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చని పల్లెపట్టుగా పిలుపనిస్తున్నారు. హరిత హారం కింద నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతనుయవకులు తీసుకోవాలని చెబుతున్నారు.
అలాగే ప్లాస్టిక్ మీద కూడా ఆయన యుద్ధం ప్రకటించారు. ప్లాస్టిక్ వాడకం నివారించేందుకు చైతన్యం కలిగించాలని, గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించే దిశగా యువకులు అడుగులు పిలుపు నిస్తున్నారు. ఇవన్నీ యాక్టివ్ పొలిటిషన్స్ చేసే పనులు కావు. సోషల్ వర్కర్లు చేసే పని. వూరువాడ లకు పనికొచ్చే పనులు.
ఆయన యూత్ తో బాగా కనెక్ట్ అవుతున్నారు. యువకులు కూడాతమకు ఓపెన్ జిమ్ కావాలి ఆయనను అడుగుతున్నారు. అందుకు హరీశ్ సానుకూలంగా స్పందిస్తూన్నారు.