కాశ్మీర్ లో అమ్మకానికి ప్లాట్, తొలిబేరం రెడీ

జమ్ము కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి ఇస్తున్న అర్టికల్ 370 ని రద్దు చేయాలని కేంద్రం అనుకున్నప్పటి నుంచి చర్చంతా రియల్ ఎస్టేట్ మీదే నడుస్తూ ఉంది.
కాశ్మీర్ లో ఇక భూములు కొన వచ్చు,అక్కడ అపార్ట్ మెంట్లు కట్టి అమ్మవచ్చు. ప్లాంటేషన్ లు చేయవచ్చు. ఇక డబ్బున్న వాళ్లంతా సుందర కశ్మీరానికి వలస సోయి సెటిలవుతారని అనుకుంటున్నారు.
ఇంతవరకు ఉండిన కశ్మీర్ చట్టాల ప్రకారం కశ్మీర్ లోె బయటి వారు భూములు కొనేందుకు అర్హులు కాదు. అలాగే అక్కడిఅమ్మాయిలు కశ్మీర్ బయటివారిని పెళ్లి చేసుకుంటే పేరెంటల్ ప్రాపర్టీలో హక్కులు కోల్పోతారు.
అందువల్ల కాశ్మీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పంజుకోలేదు. బయటి రాష్ట్రాలు వెళ్లి అక్కబ బంగాళాలు, గెస్టు హౌసులు కట్టుకోలేకపోయారు. దానికి తోడు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఎలాగూ ఉంది.

ఇది కూడా చదవండి:

అమెరికా-చైనా ట్రేడ్ వార్… ఇంతకీ ఆ గొడవ ఏంటి?
ఇపుడు అర్టికల్ 370, 35ఎ ఎత్తి వేశాక ఈ సమస్య తీరిపోయింది. అక్కడ స్వేచ్ఛగా భూములు కొనవచ్చు.అమ్మ వచ్చు. విల్లాలు, అపార్ట్ మెంటులు కట్టవచ్చు. అమ్ముకుని వ్యాపారం చేయవచ్చు.
కాశ్మీర్ లోని విశాలమయిన ఖాళీ ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది.  ధర కూడా పెరుగుతూంది.
ఇంతవరకు ఇతర వాళ్లు కశ్మీర్ కు వలసపోయి స్థిర పడటం జరగలేదు.స్థిరపడినా హక్కులు రావు. అందుకే అక్కడ జనసాంద్రత (2011)బాగా తక్కువ. చదరపు కిలోమీటరుకు 56 మంది మాత్రమే. జాతీయ సగటు వచ్చేసి 382. తెలంగాణ జనసాంద్రత 307.
ప్రతికుటుంబానికి కొంత భూమి ఉంది. ఇక ముందు  దానిని అమ్మేసి చాలా మంది ఇతరప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. లేదా నాలుగు డబ్బులు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ కు తెరలేస్తూ ఉంది.
ఇపుడు మొదటి బేరం గుజరాత్ నుంచి వచ్చిందనుకోవాలి. ఎందుకంటే సూరత్ లో స్థిరపడిన ఒక కశ్మీరి పండిట్ మహిళ తన భాగానికి వచ్చిన భూమిని అమ్మేయాలనుకుంటున్నట్లు మీడియా కు చెప్పింది.
జమ్మ-కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా కేంద్రానికి 40 కిమీ దూరన ఉన్న పంజార్ గ్రామంలో ఆమె కొంత భూమి ఉంది. ఆమె పేరు మృదులా శర్మ. వృత్తిరీత్యా ఫోటో గ్రాఫర్ . సూరత్ లో స్థిరపడింది. ఆమె తల్లితండ్రులు మాత్రం ఇంకా కశ్మీర్లోనే ఉన్నారు. తన భూమిని అమ్ముకునేందుకు ఆమె తల్లితండ్రుల అనుమతి కూడా తీసుకున్నారు.
కేంద్రం 370 అర్టికిల్ రద్దు చేస్తూనే ఎగిరి గంతేసి తాను ఆస్తి అమ్మకానికి రెడీ అని ప్రకటించారు. ‘ 370 ఎత్తివేశాక కశ్మీరీలలో ఉండే చాలా భయాలు తొలగిపోయాయి. ఇపుడు రాష్ట్ర డెవెలప్ అవుతుంది. అయితే, ఇండస్ట్రియల్ డెవెలప్ మెంట్ జరిగితే చేతి వృత్తులు రంగంలో ఉన్న ఉద్యోగాలు ఎగిరిపోతాయి,’ అని వాఖ్యానించారు.
జమ్ముకశ్మీర్ లో భూమిని మర్ల (Marla) లలో కొలుస్తారు. ఒక మర్ల అంటే 270 చదరపు అడుగులు. ఇపుడు ఒక మర్ల రేటు కశ్మీర్ లో నాలుగు నుంచి అయిదు లక్షల రుపాయల దాకా ఉంది.
ఇంక దీనికి రెక్కలొస్తాయని మృదుల, ఆమె భర్త రౌనక్ వర్మ ఆశిస్తున్నారు. ’తమ భూముల మీద తొలిసారిగా ఇపుడు కశ్మీరీ ప్రజలకు ఆశలుచిగురించాయి. ఇదే విధంగా కశ్మీర్ లో భూములు కొనేందుకు బయటి వాళ్లు కూడా ఉత్సహం చూపుతున్నారు,’ అని ఆమె భర్త రౌనక్ వర్మ చెప్పారు.
జోరుగా ఫేక్ న్యూస్, జోక్స్
ఇలాంటి సందర్భాలలో ఫేక్ న్యూస్ కూడా  ఉపందుకుంటాయి.అర్టికల్ 370 ని రద్దు చేసిన గంట సేపట్లోనే ల్యాండ్, ప్రాపర్టీ సేల్ మెసేజెస్ విపరీతంగా సోషల్ మీడియా షేర్ కావడం మొదలయింది. ముఖ్యంగా శ్రీనగర్ లాల్ చౌక్ లోని ఒక భూమి గురించిన ప్రకటన విపరీతంగా వైరలయింది.
ఈ ప్లాట్ ధర రు. 11.5 లక్షలు. “Book your land at Kahsmir Laal Chowk Rd from 11.25 lakh starting with GST. Kashmir 370 removed.Limited stock! For more details call on 9019292918”
తమ ఇలాంటి రియల్ ఎస్టేట్ మేసేజ్ లు వస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు.
అయితే, ఈ మేసేజ్ నిజమయింది కాదని, ఫేక్ అని Huffpost కనుగొనింది. నిజానికి ఈ మేసేజ్ పశ్చిమబెంగాల్ పలు రియల్ ఎస్టేట్ ప్రాజక్టులు చేసిన ఈడెన్ ియల్టీకి చెందిందని తేలింది. జమ్ము కశ్మీర్ లో ఎలాంటి బిజినెస్ చేయడం లేదని, ఈ మెసేజ్ తమది కాదని ఈ కంపెనీ  Huffpostకు వివరణ ఇచ్చింది.

 

(Featur Image credit Twitter)