Home English అమెరికా-చైనా ట్రేడ్ వార్ … అసలా గొడవేంటి?

అమెరికా-చైనా ట్రేడ్ వార్ … అసలా గొడవేంటి?

232
1
SHARE
అమెరికా చైనా  దేశాలు తుపాకుల్తో బాంబుల్తో మిసైల్స్ కాకుండా ట్రేడ్ టారిఫ్ లతో కొట్లాడుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు కొట్లాడుకుంటంటే  ప్రకంపనలు ప్రపంచమంతా కనిపిస్తున్నాయి.
ప్రపంచదేశాల అర్థిక వ్యవస్థల మీద దీని ప్రభావం పడుతూ ఉంది.అందుకే కొట్టుకుంటున్నది అమెరికా చైనాలే అయినా, దానికి గురించి అంతా తెలుసుకోవాలి.
అమెరికా అధ్యక్షుడెవరయినా తాను ప్రపంచానికంతటికి అధ్యక్షుడనుకుంటుంటారు. తను చెప్పిందే అన్ని దేశాలు పాటించాలనుకుంటుంటారు. అలా కాకపోతే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తుంటారు.
ఇతర దేశాలతో ఇబ్బంది వచ్చినపుడు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందం తనకి అనుకూలంగా లేకపోతే ఎవో అరోపణలు చేసి దాన్నుంచి  అమెరికా వెళ్లిపోతుంది.
ఈ మధ్య ఇరాన్ తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా బయటకు పోయింది. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో కూడా అంతే. ఆ ఒప్పందాల వల్ల తనకు నష్టం జరిగితే భరించడానికి ఏమాత్రం అమెరికా ఒప్పుకోదు. దానిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది.
ఇపుడు చైనాతో జరుగుతున్న ట్రేడ్ వార్ అమెరికా అసహనం నుంచి వచ్చిన పర్యవసానామే.
ఇపుడు ప్రపంచంతా స్వేచ్ఛా వాణిజ్యం సాగుతూ ఉంది. ఇందులో బాగా ఎగుమతులు చేసి కొన్ని దేశాలు వాణిజ్యపరంగా ముందున్నాయి. కొన్ని దేశాలు ఎగుమతులు చేయలేక వెనకబడి ఉన్నాయి.
దీనిని వాణిజ్య వ్యూహాలు మార్చుకుని సరి చేసుకోవాలే తప్ప బెదిరింపులకు పోయి గూండా గిరి చేయడానికి వీల్లేదు. కాని ట్రంపు చేస్తున్నదిదే. ఇదేలాగో చూద్దాం.
ప్రపంచంలో ఎక్కడయినా అమెరికాయే నెంబర్ వన్ గా ఉండాలని ఆయన భావిస్తారు.  అమెరికా ఉద్యోగాలలో ఏసియావాసులెక్కువగా ఉన్నారు. అది ఆయనకు నచ్చలేదు.  అమెరికా ఫస్ట్ అని హెచ్ 1 బి వీసాల మీద ఆంక్షలు పెట్టారు.
ఇలాంటి అస్త్రాన్ని ఆయన చైనా మీద వాణిజ్యం లో ప్రయోగించారు.
ఒక రోజునే పొద్దనే అమెరికా -చైనా వాణిజ్య లెక్కలు చూస్తూనే ట్రంపుకు  చికాకేసింది. వాణిజ్యంలో చైనా అమెరికా పీకపట్టుకుందని అనిపించింది.అది ఆయనకు నచ్చలేదు.
అమెరికా -చైనాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే చైనా నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతుల చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా నుంచి చైనా కొంటున్నవి చాలా తక్కువు. అంటే చైనా తయారు చేసిన సరుకుల్ని కొన్ని అమెరికా చాలా డబ్బు తగలేస్తావుందని, నష్టపోతున్నదని ట్రంపు జుట్టు పీక్కున్నారు.దీనిని మార్చాలనుకున్నారు. చైనా సరుకులనకు చెక్ పెట్టాలనుకున్నారు.
అమెరికా -చైనాల మధ్య సాగుతున్నవాణిజ్యం మొత్తం (గూడ్స్ + సర్వీసులు) విలువ 2018లో 731 బిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా చేసే ఎగుమతులు కేవలం 179 బిలియన్ డాలర్లు.  యుఎస్ చేసుకునే దిగుమతులు 557.9 డాలర్లు. అంటే మొత్తం వాణిజ్యంలో లోటు 378.6 బిలియన్ డాలర్లు.
సరుకుల వాణిజ్యం సపరేట్ గా చూద్దాం. అమెరికా నుంచి చైనాకు ఎగుమతయ్యే సరుకులు 120.3 మిలియన్ లే. దిగుమతయ్యే సరుకుల విలువ 539.5 బిలియన్ డాలర్లు. అంటే లోటు ఎంత? 419.2 బిలియన్ డాలర్లు.
ఒక్క సర్వీసెస్ లో మాత్రమే అమెరికా ట్రేడ్ సర్ ప్లస్ లో ఉంది. అయితే  అది బాగా తక్కువ, కేవలం 40.5 బిలియన్ డాలర్లే.
ఇది ట్రంపుకు నచ్చలేదు. అమెరికా ఫస్ట్ అనేది ఆయన నినాదం కదా అందుకని చైనా నుంచి దిగుమతులు తగ్గించాలనుకున్నారు.
వెంటనే  చైనా  నుంచి సాగే దిగుమతుల మీద 10 శాతం పన్ను విధించారు. దాదాపు 300 బిలియన్ విలువయిన సరుకుల మీద 10 శాతం టారిఫ్ విధించాల్సిందేనన్నారు. విధించారు. ఇది సెప్టెంబర్ నుంచి అమలులోకి వస్తుంది. ఇప్పటికే మరొక 250 బిలియన్ డాలర్ల సరుకుల మీద 25 శాతం టారిఫ్ విధించారు.
దీనితో చైనా నుంచి దిగుమతయ్యే సరుకుల ధరలు పది శాతం పెరిగి బాగా కాస్ట్లీ  అవుతాయి. అమెరికన్లు కొనడం మానేస్తారు.
  అమెరికాకు ఎగుమతి చేయకుండా చైనాని నిషేధించడం, చైనా సరుకులు కొనకుండా అమెరికన్లని అడ్డుకోవడం  కష్టం కాబట్టి ఆయన ఇంపోర్ట్ డ్యూటీ పెంచి అడ్డుకోవాలనుకున్నారు.
ఇది చైనా వాణిజ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. అమెరికాలో కొనడం మానేస్తే చైనాలో  వస్తూత్పత్తి తగ్గిపోతుంది. కంపెనీలు మూతబడతాయి. ఉద్యోగాలు పోతాయి. ప్రభుత్వ రెవిన్యూ పడిపోతుంది. జడిపి గ్రోత్ తగ్గిపోతుంది.  అసలే చైనా ఏకానమి కొద్దిగా వీకయింది.  27 సంవత్సరాల తర్వాత చైనా తొలిసారి తిరోగమనంలో పడింది. ఇలాంపుడు ట్రంపు దెబ్బ పడింది.
అందువల్ల అమెరికా చేసిన ఈ వాణిజ్య దాడిని తగిన విధంగా ఎదుర్కొని  బుద్ది చెప్పాలనుకుందిచైనా. ఒక సర్జికల్ స్ట్రయిక్ జరిపింది. అదే చైనా కరెన్సీ డివాల్యయేషన్. చైనా కరెన్సీ యువాన్ విలువని డాలర్ మారకం రేటుతో నాలుగు శాతం తగ్గించింది. ఇది వైట్ హౌస్ మీద బాంబులాగా పడింది. ట్రంప్ దిమ్మ తిరిగిపోయింది. వెంటనే చైనాని కర్సెన్సీ మానిప్యులేటర్ అని తిట్టేశాడు. అధికారికంగా ప్రకటించాడు. (నిన్నఇండియాను కూడా డ్రగ్ ప్రొడ్యూసర్ అని ప్రకటించాడు.)
ఎందుకంటే…
అమెరికాలో అసలే చైనా వస్తువులంటే మోజు. చైనా కరెన్సీ విలువను ఏడు యువాన్ల కిందికి తీసుకువచ్చింది. ఒకపుడు డాలర్ కు ఏడు యువాన్లు. ఇందులో నాలుగు శాతం తగ్గించింది.
దీని పర్యవసానాలు అమెరికాలో చాలా తీవ్రంగా ఉంటాయి. ట్రంప్ అనుకున్నదొకటి, అవుతున్నదొక్కటి. ఆమెరికా వాణిజ్యాన్ని ఇది బాగా దెబ్బతీస్తుంది.
అమెరికాకు కొన్ని వేల చైనా కంపెనీలు సరుకులను ఎగుమతి చేస్తుంటాయి. ఇవన్నీ వాటి ధరలను చైనా కరెన్సీలో చూపిస్తాయి. చైనా కరెన్సీ విలువ నాలుగు శాతం తగ్గిందన్నపుడు ఈ కంపెనీలన్నీ అమెరికాకు ఎగుమతి చేసే తమ సరుకుల ధరలను నాలుగు శాతం తగ్గిస్తాయి. అమెరికాలో చైనా వస్తువులు బాగా చౌక అవుతాయి. అంటే చైనా సరుకులు బాగా అమ్ముడుపోతాయి. చైనా చర్యకు అమెరికా వినియోగదారులనుంచి మద్దతు లభిస్తుంది.
ఇక్కడ మరొక ముఖ్యమయిన విషయం ఉంది.
అమెరికా వినియోగదారులకు ‘మేడి ఇన్ చైనా’ సరుకులు ఒక వైపు  చౌక అయితే, చైనాలో అక్కడి పౌరులకు ’మేడ్ ఇన్ అమెరికా’ సరకులు ఇంకా ఖరీదవుతాయి.
ఎందుకంటే, చైనా కరెన్సీ బలహీనపడటంతో డాలర్ ప్రియమవుతుంది. మేడ్ ఇన్ అమెరికా గూడ్స్ ప్రియమవుతాయి.
చైనాలో వినియోగదారులు వాటిని కొనడం తగ్గిస్తారు.చైనా చర్యతో అమెరికా కి చెంప దెబ్బ గోడదెబ్బ రెండు తగిలాయి.
ఏ దేశమయినా కరెన్సీ డివాల్యు చేస్తే ఆదేశానికి చాలా ప్రయోజనం. అందుకని ఇష్టాను సారం కరెన్సీ డీ వాల్యు చేయడానికి అంతర్జాతయ అవగాహనలు వప్పుకోవు. కరెన్సీ అడ్జస్టు మెంట్ మార్కెట్లే చేయాలి తప్ప ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఉత్తర్వుల ద్వార డివాల్యూ చేయరాదు.
అయితే, అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు ఏముంటాయి? అమెరికా ఒకటి చేస్తే చైనా దానిమీద కౌంటర్ ఎటాక్ చేస్తూ ఉంది.
చైనా కరెన్సీని తరచూ డీ వాల్యూ చేస్తు ఉందని ఆ మధ్య అమెరికా నుంచి ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇటీవల అమెరికా అర్థిక వ్యవస్థ బలపడుతూ ఉండటంతో, డాలర్ పుంజుకోవడంతో చైనా  యువాన్ డివాల్యూయేషన్ పాలసీ వదిలేసింది. యువాన్ ను కంట్రోల్ చేయడం మానేసింది. ఇపుడు అమెరికా చైనా దిగుమతుల మీద 10 శాతం టారిఫ్ విధిండంతో చైనా ఎత్తుకు పై ఎత్తు వేసింది.
ఇది ప్రభుత్వం చర్య కాదని, మార్కెట్ శక్తుల వల్ల జరిగిన యువాన్ అడ్జస్ట్ మెంటేనని చైనా వాదిస్తూ ఉంది. ఏమయినా సరే, యువాన్ ను డీ వాల్యూ చేసి చైనా తీసిన దెబ్బనుంచి ట్రంప్ కోలుకోలేకపోతున్నాడు. తదుపరి ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి.

1 COMMENT

Comments are closed.