జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైరయిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి.
విజయ్ కుమార్ ఐపిఎస్ అనగానే ఒక ఫేమస్ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆయన కెరీర్ చూస్తే ఆయన ట్రిగ్గర్ మీద నుంచి వేలెపుడైనా తీశాడా అని అనుమానం వస్తుంది. ఆయన కన్నుపడితే ఫినిషే. అదే విధంగా ఆయన మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు కూడా ఉన్నాయి. హక్కులసంఘాల వాళ్లు చేస్తున్న ఆరోపణలకు రిప్లైగా ఆయన ఈ డైలాగ్ వదిలారు.
విజయ్ కుమార్ 100 శాతం పోలీసని ఈ డైలాగుతో అర్థమవుతుంది. పోలీసు చేతిలో గన్ ఉండేది కాల్చేందుకే గాని అభరణంగా కాదు (Policemen do not carry guns as ornaments) అని హక్కుల సంఘాల వాళ్లు ఆరోపించినపుడు ఆయన చేసిన సంచలన వ్యాఖ్య చేశారు.
తమిళనాడు క్యాడర్ చెందిన విజయ్ కుమార్ ఇపుడు గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సలహాదారుగా ఉంటున్నారు.
ఎన్ కౌంటర్ల స్పెషలిస్టుగా పేరున్న విజయకుమార్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉద్రిక్త కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా సరౌన వ్యక్తి అని భావించిఆయన కుప్రమోషన్ ఇస్తున్నట్లు సమాచారం.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ గా తెలంగాణ గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ను నియమిస్తున్నారని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. అయితే, ఈ పదవి రేసులో విజయ్ కుమార్ ముందున్నారని చెబుతారు. నరసింహన్ కూడా ఐపిఎస్సే.
ఇది కూడా చదవండి: