2019 సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు జరుగనున్నాయి.
– సాలకట్ల బ్రహ్మూత్సవాల వివరాలు
సెప్టెంబరు 30న – ధ్వజారోహణం,
అక్టోబరు 4న – గరుడవాహనం,
అక్టోబరు 5న- స్వర్ణరథం,
అక్టోబరు 7న – రథోత్సవం,
అక్టోబరు 8న- చక్రస్నానం, ధ్వజావరోహణం.
ప్రత్యేక దర్శనాలు :
– ఆగస్టు 13, 27వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలుంటాయి
– ఆగస్టు 14, 28వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తారు.
ఆగస్టు 11 నుండి 13 వరకు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు :
– ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 10న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆగస్టు 9న శ్రీవరలక్ష్మీ వ్రతం :
– ఆగస్టు 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఈ సందర్భంగా తిరుచానూరులో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేస్తారు.
మనగుడి :
– ఆగస్టు 9 నుండి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలోని 23 జిల్లాలలో ఎంపిక చేసిన ఆలయాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఆగస్టు 23న గోకులాష్టమి :
– ఆగస్టు 23న తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోపూజ, గోకులాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.
తిరుమలలో నీటి నిల్వ :
– తిరుమలలో నీటి నిల్వ మరియు కల్యాణిడ్యాం, బోర్ వెల్స్ అన్నింటిని కలుపుకుని 124 రోజుల వరకు సరిపడ నీరు అందుబాటులో ఉంది.
జనపనార బ్యాగులు
– తిరుమలలో జూలై 24,25,26 తేదీలలో ప్రయోగాత్మకంగా జనపనార బ్యాగులను భక్తులకు పంపిణీ చేశారు.
– భక్తుల నుండి మంచి స్పందన లభించింది. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ఈ బ్యాగులను ఆగష్టు మూడో వారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తాం.
దర్శనం :
– గతేడాది జూలైలో 23.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జూలైలో 23.82 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం :
– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూలైలో రూ.102.88 కోట్లు కాగా, ఈ ఏడాది జూలైలో రూ.109.60 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం :
– గతేడాది జూలైలో57.32 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూలైలో 61.27 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూలు :
– గతేడాది జూలైలో 99.81 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూలైలో 1.14 కోట్ల లడ్డూలను అందించాం.
గదులు :
– గదుల ఆక్యుపెన్సీ గతేడాది జూలైలో 104 శాతం నమోదు కాగా, ఈ ఏడాది జూలైలో 106 శాతం నమోదైంది.
ఈ విషయాలను టిటిడి ఇవొ అనిల్ సింఘల్ ‘డయల్ యువర్ ఇవొ’ కార్యక్రమంలో వెల్లడించారు.
https://trendingtelugunews.com/ias-drunk-driving-kills-kerala-journalist/