కేరళ ఐఎఎస్ అధికారి ఒకరు అర్థరాత్రి ఒక మహిళతో కారు లో వెళ్తు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఒక మోటార్ సైకిల్ ను ఢీకొట్టారు. దీనితో బైక్ మీద ప్రయాణిస్తున్న జర్నలిస్టు అక్కడిక్కడే చనిపోయాడు.
ఫుల్ గా తాగి కారునడిపినందునే ఈ ప్రమాదం జరిగిందని సాక్ష్యలు చెబుతున్నారు. ఆయనని ఫిజికల్ గా పరీక్షించిన డాక్టర్ కూడా ఐఎఎస్ అధికారి దగ్గిర మందు వాసన వచ్చిందని చెప్పారు.
ప్రమాదం చేయడమే కాకుండా ఐఎఎస్ అధికారి అబద్దాలు కూడా చెబుతున్నాడు.
కారు తాను నడపలేదని, కారులో ఉన్న ఒక మహిళ నడిపిందని చెబుతున్నాడు. అయితే, ఆ మహిళ మాత్రం కారు నడిపింది తాను కాదని, ఐఎఎస్ ఆఫీసరే నని పోలీసుల దగ్గిర స్టేట్ మెంట్ ఇచ్చారు. ఐఎఎప్ ఆఫీసర్ పేరు శ్రీరామ్ వెంకటరామన్. సర్వే అండ్ ల్యాండ్ సెటిల్ మెంట్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆయన డ్రంక్ డ్రైవింగ్ కు బలిఅయిన జర్నలిస్టు పేరు మహమ్మద్ బషీర్ (35). మలయాళ పత్రిక ‘సిరాజ్’ తిరువనంతపురం బ్యూ రో చీఫ్.
ప్రమాదం జరిగాక గుమికూడిన సాక్షుల కథనం ప్రకారం ఐఎఎస్ అధికారి ఫుల్ గా తాగి ఉన్నాడు.ఆయనే కారును చాలా ర్యాష్ గా నడుపుతూ వచ్చాడని వారు చెబుతున్నారు.
ప్రమాదం తిరువనంతపురం మ్యూజియం జంక్షన్ లో జరిగింది. స్థలంలో రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.
ప్రమాదంలో గాయపడిన వెంకటరామన్ ని ఆసుపత్రికి తరలించారు. ఆయన మీద ఐసిపి సెక్సన్స్ 279 (ర్యాష్ డ్రైవింగ్ ) 304 ఎ కింద కేసు నమోద చేశారు.
కారునడుపుతున్నది ఐఎఎస్ అధికారేనని సిటి పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ గురుదిన్ చెప్పినట్లు మలయాళ మనోరమ రాసింది.
తాను డ్రైవ్ చేయలేని వెంకటరామన్ బుకాయిస్తున్నా సిసిటివి ఫుటేజ్ చూశాక పోలీసులు తాగి కారు నడిపింది, బైక్ ను కొట్టింది వెంకిటరత్నమే నని తేలిపోయిందని పోలీసులు చెప్పారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల బషీర్ మరణం పట్ల సంతాపం తెలిపారు.
కొంతకాలం స్టడీ లీవ్ తర్వాత ఆయన ఈమధ్య విధుల్లో చేరాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా నియమించింది. ఆయన 2013 బ్యాచ్ కు చెందిన అధికారి. బసీర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
https://trendingtelugunews.com/india-loses-sixth-largest-econony-tag-france-gains/