షాకింగ్ న్యూస్ : BSNL ఉద్యోగులకు ఇంకా జీతాల్లేవ్

ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బిఎస్ ఎన్ ఎల్), మహాగనర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్ (ఎమ్ టిఎన్ ఎల్ ) ఉద్యోగులకు జూలై నెల జీతాలు చెల్లించలేకపోయాయి.
ఈ సంస్థలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి.
ఈ రెండు సంస్థలలో దాదాపు 1.98 లక్షల మంది ఉద్యోగులున్నారు. జీతాలు ఎపుడు చెల్లిస్తారో కూడా తెలియడం లేదని, దీనిమీద మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి హమీలేదని ఆల్ ఇండియా యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ఎయుఎబి) కన్వీనర్ పి అభిమన్యు తెలిపారు.
సాధారణంగా నెల చివరి రోజున జీతాలు క్రెడిట్ అవుతూ ఉండేవి. బిఎస్ ఎన్ ఎల్ ో 1.76లక్షల మంది ఉద్యోగులుంటే ఎమ్ టిఎన్ ఎల్ లో 22 వేల మంది ఉద్యోగులున్నారు.
ఈ ఏడాది అంటే మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టాక ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా నెల దాటినా జీతాలు చెల్లించలేకపోవడం ఇది రెండవ సారి. ఇంతకు ముందు ఫిబ్రవరి నెల జీతాలు ఎపుడో మార్చి మధ్యలో చెల్లించారు.
బిఎస్ ఎన్ ఎల్ నెలనెలా రు. 750 కోట్లనుంచి రు. 850 కోట్లదాకా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎమ్ టిఎన్ ఎల్ జీతాలు దాదాపు రు.150 కోట్ల దాకా ఉంటాయి.