బంగారుకు ‘స్వర్ణ యుగం ’ రాబోతున్నదని అంతర్జాతీయ బంగారు వ్యాపారనిపుణులు చెబుతున్నారు.
బంగారం ధర ఉధృతమయ్యే దశలోకి (bull run) ప్రవేశించిందని, ఇక అది తగ్గే సూచనలు అంతర్జాతీయంగా కనిపించడం లేదని వారు చెబుతున్నారు.
దీనికి కారణం, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రగతి లేక పోవడం, దేశాల ప్రగతి మందగించడం, అమెరికా మెుదలుపెట్టిన ట్రేడ్ వార్స్, అమెరికా-ఇరాక్ సంక్షోభం..ఇలాంటి వాటి వల్ల అంతర్జాతీయ వాణిజ్యం బలహీనపడుతుందని వారు చెబుతున్నారు.అపుడు మాన్యుఫ్యాక్యరింగ్ కంపెనీలలో ఇన్వెస్ట్ మెంట్ల మీద రాబడి తగ్గడమే కాదు, నష్టం రావచ్చ. అందువల్ల ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్ మెంట్లకు మరొక సురక్షితమయిన మార్గం వెదుక్కుంటారని, దీనికి బంగారానికి మించిన ప్రత్యామ్నాయం లేదని వారు చెబుతున్నారు.
అంతర్జాతీయ వాణిజ్యం 2008 నాటి స్థాయికి పడిపోవడం అందోళన కలిగించే విషయమని చెబుతున్నారు.
ప్రయివేటు మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి డేటా సేకరించి ఈ ఇండెక్స్ ను తయారు చేస్తారు. కంపెనీకి వస్తున్న ఆర్డర్లు ఎలా ఉన్నాయి, ప్రొడక్షన్ పెరిగిందా తరిగిందా, స్టాగ్నేషన్ లో ఉందా, ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది, ఇన్వెంటరీ లెవల్స్ ఎలా ఉన్నాయి, సప్లయి డెలివరీస్ సకాలంలో జరుగుతున్నాయా అనే అయిదు అంశాలమీద వివరాలు సేకరించి దీనిని అంచనా వేస్తారు.
దీనికోసం 400 ప్రయివేటు కంపెనీలలో సర్వే చేస్తారు. ఈ ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్లు లెక్క.
భారత దేశానికి సంబంధించి PMI డేటాను జపాన్ కంపెనీ నికీ (Nikkei) ప్రచురిస్తుంది. ఇవన్నీ నెలసరి సర్వేలు. ఈ సర్వేల ప్రకారం భారతదేశపు PMI 2019 జూన్ లో 52.1. ఇది అంతకు ముందు మూడు నెలల నుంచి పడిపోయింది. అంతకు ముందు అంటే మే నెలలో 52.7 ఉండింది.
ఇక యూరోజోన్ లో PMI 50.0 నుంచి 47.6కు పడిపోయింది. అంటే అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ప్రగతి కుంచించుకుపోతున్నదని అర్థం. ఇంక, ఇంగ్లండులో ఇది 43.1. ఇంక చైనాలో PMI పదేళ్ల కిందటి స్థాయికి దిగి 49.4 కు చేరింది. ఇక 2019 జూన్ లో అమెరికాలో PMI 2009 సెప్టెంబర్ నాటి స్థాయికి 51.7 పడిపోయింది. గతనెలలో ఇది 52.7.
ఇక ఇన్వెస్టర్లు చూసే మరొక కోణం బ్యాంకులందించే ఇంటరెస్టు రేటు. ఇది ప్రపంచమంతా పడిపోతున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఇంటరెస్ట్ రేట్లను తగ్గించే మూడ్ లో ఉంది. ఇలాగే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా రేట్లను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
అందువల్ల మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం కాదని, ఇక మిగిలింది బంగారమే నని సర్వత్రా భావిస్తున్నారు.
ఇలా బులియన్ లోకి పెట్టుబడులు దూకడం మొదలయింది. అందువల్ల ముందు ముందు బంగారం ఇంకా నిగనిగలాడుతుందని అంటున్నారు.