పాకిస్తాన్ శివాలయంలో మళ్లీ గంటల మోత… 72 యేళ్ల కిందట మూత

పాకిస్తాన్ లోని సియల్ కోట్ లోని వేయ్యేళ్ల నాటి పురాతన హిందూ శివాలయాన్ని హిందువుల కోసం తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ఆగస్టు 5 నాగపంచమి రోజున అధికారికంగా ఒక పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయాన్ని పున: ప్రారంభిస్తారు.
ఆలయాని తెరవాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సియల్ కోట్ డిప్యూటి కమిషనర్ బిలాల్ హైదర్ ప్రకటించారు. ఈఆలయం పేరు షవాలా తేజా సింగ్ ఆలయం.
1947 లో దేశ విభజన జరిగినపుడు ఇక్కడి హిందూకుటుంబాలు భారత్ వెళ్లిపోయాయి. అప్పటి నుంచి ఈ ప్రాపర్టీ ఎవాక్యీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) ఆదీనంలో ఉండింది.
సియాల్ కోట్ కు చెందిన హిందూ కుటుంబాలు ఈ ఆలయాన్ని తెరవాలని, ఇక్కడ దాదాపు వంద కుటుంబాలు ఇంకా ఉన్నాయని చెబుతు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూనే ఉన్నారు.
Also Read: జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర,పాడె మోస్తూ కంటతడిపెట్టిన కర్నాటక స్పీకర్ 
అక్కడి  సురీందర్ కుమార్ రెండు దశాబ్దాలు పాటు ఇలా అర్జీలు పెడుతూనే వస్తున్నారు. ఫలితం కనిపించలేదు. అయితే, గత ఏప్రిల్ లో సురీందర్ కుమార్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆశ్చర్యం. అది ఆలయం గురించి. ఈ ఆలయాన్ని తెరవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు సురీందర్ కు తెలిపారు.
గత 72 సంవత్సరాలుగా ఈ ఆలయం పేరుకు ETPB అదీనంలోఉన్నా ఇది జులాయి గాళ్లకు, డ్రగ్స్ తీసుకునేవాళ్ల అడ్డగా ఉండింది. బాగా దెబ్బతినింది. ఆలనాపాలన లేక శిధిలాలయంగా మారిపోయింది.
అందుకే గోడల మీద ఉన్న చిత్రాలన్నీ మాసిపోయాయి.
గత శనివారం నాడు లాంఛనంగా ఆలయంగేట్లు తెరిచారు. ఆగస్టు 5 నాగపంచమి నాడు హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి హర హర మహదేశ, ఓం నమఃశివాయ అంటూ ఆలయం ప్రారంభమవుతుంది.
తాను పదవి చేపట్టడానికి ఒక నెల ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ఒక వాగ్దానం చేస్తూ పాకిస్తాన్ లో మైనారిటీలకు సమాన హోదా తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి ఆలయం పున: ప్రారంభం గురించి చర్యలు తీసుకోమని చెప్పారని ETPB ఛెయిర్మన్ డాక్టర్ అమీన్ అహ్మద్ చెప్పారు.
ఆలయ పునరుద్ధరణ పనులను కూడా  ప్రభుత్వమే చేపడుతుందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇదే వెయ్యేళ్ల కిందట నిర్మాణమయిన గుడి.
ఈ ఆలయం గురించి పూర్తి కథనం అరబ్ న్యూస్ లో చదవండి.

 

(ఫోటో ArabNews సౌజన్యం)