ఇండియాలో వాట్సాప్ ఎందరు వాడుతున్నారో తెలుసా?

ఇండియాలో వాట్సాప్ వినియోగం బాగా ముదిరింది. మేసేజింగ్ , కమ్యూనికేషన్ కు సంబంధించి ఇన్సంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇండియాను తన గ్రిప్ లోకి తీసుకుంది. నెలసరి వాట్సాప్ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారతదేశంలో 40 కోట్లకు (400 మిలియన్లకు) చేరుకుంది.
ఈ విషయాన్ని ఎవరో కాదు, నీతి ఆయోగ్ సిఇవొ అమితాబ్ కాంత్ స్వయంగా వెల్లడించారరు. వాట్సాప్ వోనర్ ఎవరో తెలుసుగా, ఫేస్ బుక్.
2017లో వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 మిలియన్లు. అపుడు ఈ విషయాన్నివాట్సాప్ యాజమాన్యమే ప్రకటించింది. 2019 కల్లా ఇది రెట్టింపయింది.

అమితాబ్ కాంత్ చెప్పిన దాన్ని వాట్సాప్ ఖండించలేదు.
ప్రపంచమొత్తంగా వాట్సాప్ కు 1.5 బిలియన్ యూజర్లున్నారు. ప్రతిచోటా వాట్సాప్ కు టెలిగ్రామ్, హైక్ వంటి ఇతర ప్లాట్ ఫామ్స్ నుంచి పోటీ ఉంది.ఇండియాలో ఈ ప్లాట్ ఫామ్స్ లు అంతగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో వాట్సాప్ దూసుకుపోయింది.
తొందర్లో వాట్సాప్ పేమెంట్ సర్వీస్ కూడా ప్రారంభించాలనుకుంటున్నది. గత ఏడాది ఒక మిలియన్ శాంపిల్ యూజర్స్ తో బీటా టెస్ట్ కూడా నిర్వహించింది.
అయితే, యుపిఐ పేమెంట్ గైడ్ లైన్స్ ఉల్లంఘించందన్న ఆరోపణతో దీనిని నిషేధించారు.పేమెంట్ సర్వీస్ లకు సంబంధించి ఇండియాలో లో వాట్సాప్ PhonePe, GooglePay, Paytm, AmazonPay వగైరాలతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే, అద్భుతమయిన యూజర్ బేస్ వున్నందున రావడంరావడంతోనే వాట్సాప్ వీటన్నింటిని తోసేసి దూసుకుపోతుందనిఅనుకుంటున్నారు.
ఇండియాలో వాట్సాప్ నీతి ఆయోగ్ తో , ఇండియన్ స్కూల్ అప్ పబ్లిక్ పాలసీతో కలసి పని చేయాలనుకుంటున్నది.