ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఇప్పటికదా ఇఎస్ ఎల్ నరసింహన్ యే రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్వవహరించారు.
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మంగళవారమే రాష్ట్రానికి చేరుకున్నారు.
నేటి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కోసం రాజ్ భవన్‌ను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గవర్నర్ ముఖ్యులతో సమావేశమయ్యే మందిరాన్ని కలంకారి చిత్ర రూపాలతో అందంగా అలంకరించారు.
11.15 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజ్ భవన్‌కు చేరుకున్నారు.
11.20కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని.. గవర్నర్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు.
11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది.
గవర్నర్ ప్రమాణ స్వీకారం దృష్ట్యా రాజ్ భవన్ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.