అయోధ్యలో శ్రీరాముడికి ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం

ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని యుపి ముఖ్యమంత్రి అదిత్యనాథ్ యోగి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.అది శ్రీరాముడి విగ్రహం. అయోధ్య పట్టణంలో 100 ఏకరాల స్థలంలో ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
విగ్రహం ఎత్తు 251 మీటర్లు. విగ్రహం ప్రతిష్టకు అవసరమయన ప్రణాళిక వెంటనే సిద్ధం చేయండని ఆయన అధికారుఅను ఆదేశించారు.
అమెరికా న్యూయార్క్ లోని లిబర్టీ విగ్రహం ఎత్తు 9 93 మీటర్లే. ముంబయిలోని అంబేద్కర్ విగ్రహం ఎత్తు 137.2 మీటర్లయితే, గుజరాత్ లో ఆ మధ్య ఏర్పాటుచేసిన సర్దార్ పటేల్ విగ్రహం ఎత్తు 183 మీటర్లే. చైనాలో ప్రతిష్టించాలనుకుంటున్న గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఎత్తు 208 మీటర్లు. ముంబాయిలో 212 మీటర్ల ఎత్తయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదన ఉంది. వీటన్నింటి మించిపోతుంది అయోధ్య విగ్రహం.
అయోధ్య రాముడి విగ్రహాన్ని ఏర్పాటుచేయడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వ సహాయం తీసుకుంటుంది.
ఈ విగ్రహంతో పాటు అయోధ్య రూపు రేఖలు మార్చేందుకు చర్యలు తీసుకుంటారు. విగ్రహం ఏర్పాటుచేస్తున్న ప్రదేశంలో ఒక డిజిటల్ మ్యూజియం, ఇంటర్ ప్రెటేషన్ సెంటర్,లైబ్రరీ, ఫుడ్ ప్లాజా, శ్రీరాముడి సారాంశంతో లాండ్ స్కేపింగ్ ఉంటాయని యుపి ప్రభుత్వం ఒకప్రకటనలో పేర్కొంది.