శునకానికి వార్షీకాలు పెడుతున్న కృష్ణా జిల్లా రైతు

ఆ యజమానికి కన్న బిడ్డలా పెంచుకున్న శునకం పై ఆపేక్ష తీరలేదు.
తొమ్మిది సంవత్సరాలు కన్న కొడుకులా పెంచుకున్న కుక్క మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఎడబాటును భరించలేక ప్రతి ఏడాది మనుషులకు చేసినట్లుగా దిన కర్మలు చేసి  తాను పెంచుకున్న కుక్క పై మమకారాన్ని చాటుకుంటున్నాాడాయన.
వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సూర్య ప్రకాష్ అనే రైతు ఒక రోజు పని మీద నూజివీడు వెళ్ళాడు.
అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్ని కుక్కపిల్ల కుయ్ కుయ్ మంటూ కనిపించింది. ముచ్చటపడ్డారు. ఇంటికి తెచ్చుకొని  పెంచుకున్నాడు.
అయితే అది సహజంగా కుక్కలా ఉండకుండా మనుషిలా ప్రవర్తించి యజమానిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వుండేది.
సూర్యప్రకాష్ తనకు మగపిల్లలు లేకపోవడంతో దానికి అంజి అని పేరు పెట్టి  అచ్చు తన కుమారుడు అనుకొనే పెంచి పెద్ద చేశాడు.
అయితే తొమ్మిది సంవత్సరాలు అల్లారుముద్దుగా తమ మధ్య పెరిగింది.ఇంట్లో మనిషిలా మసిలేది. అయితే, ఒక రోజు అంజి అనారోగ్యంతో చనిపోయాడు.
అంజి మరణం సూర్యప్రకాశ్ నే ఇంట్లో ఉన్నవాళ్లందరికి కృంగదీసింది. అంజికి అంత్య క్రియలు పూర్తి చేశాడు. అయితే, అంజిని మర్చిపోవడం కష్టంగా ఉంది.  అందుకే దానిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
అంజి కి ప్రతి ఏడాది మనుషులకు  చేసే  కర్మలన్నీ చేసి దాని ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంటాడు.
 ఇలా చనిపోయిన వాళ్ళని అలా మర్చిపోయే రోజులు ఉన్న ఈ రోజుల్లో శునకాన్ని తన కుమారుడు అనుకోని పెంచి పోషించి చనిపోయిన తర్వాత దానికి ఏడాది దిన కర్మలు చేయడం పై గ్రామస్తులు ఆశ్చర్య పోతున్నారు.