ముఖేష్ అంబానీ జీతం పదేళ్లుగా పెరగలేదు, ఇంతకీ జీతమెంతో తెలుసా?

పదేళ్లుగా ఒక పెద్ద ఉద్యోగి ఇంక్రిమెంట్ లేకుండా,జీతం పెరగకుండా పనిచేస్తున్నాడు. ఇది సాధారణమయినవిషయం కాదు. ఇలా బయటజరిగితే గొడవవుతుంది.
అయితే, ముఖేష్ అంబానీ విషయంలో అలా జరగలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛేయిర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పని చేస్తున్న ముఖేష్ అంబానీ పదేళ్లుగా జీతం పెంపులేకుండా పనిచేస్తున్నారు.
ఆయన జీతం రు. 15 కోట్లే ఏడాదికి. అయితే, గత పదేళ్లుగా ఇదే జీతంతో పనిచేస్తున్నారు.2008-09 లో ఆయన జీతం రు.15 కోట్లుచేశారు. అప్పటినుంచి అదే జీతం. ఏడాదికి ఆయన దాదాపు రు. 24 కోట్లు వదులుకుంటున్నారు.
కంపెనీ పనిచేసే ఫుల్ టైం డైరెక్టర్ల జీతం విపరీతంగా పెరిగినా ఆయన మాత్రం జీతం పెంచుకోవడం లేదు.
ఆయన ఇష్టప్రకారం ఆయన జీతాన్ని రు. 15 కోట్ల దగ్గిర ఫిక్స్ చేశారు. అదేజీతానికి పని చేస్తూ ఆదర్శంగా ఉండాలని ఆయన పెరుగుదల తీసుకోవడం లేదని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2018 -19లో ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ లో రు. 4.39 కోట్ల జీతం, రు.9.53 కోట్ల కమిషన్ తో ఇతర వసతులకోసం రు. 31 లక్షలు, రిటైర్ మెంట్ బెనిఫిట్ రు. 71 లక్షలు ఉన్నాయి.
దేశంలో సిఇవొ ల జీతాలు బాగాపెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించుకోవాలనే చర్చజరుగుతున్నపుడు ఆయన 2009 స్వచ్ఛందంగా తనజీతం రు. 15 కోట్లు అని పర్మనెంటు ఫిక్స్ చేసుకున్నారు.
నిజానికి ఇదే కంపెనీటో పనిచేస్తున్న అంబానీ మేనల్లుళ్లు నిఖిల్ ఆర్ మేశ్వాని జీతం రు. 20.57 కోట్లు, హితల్ ఆర్ మేశ్వాని జీతం రు. 19.90 కోట్లు. గత రెండుమూడేళ్లలో వాళ్ల జీతం బాగా పెరిగింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ జీతం గత ఏడాది రు.8.99 కోట్లు. ఇపుడది రు. 10.01 కోట్లకు పెరిగింది.

( Photo Business Insider )