ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (81)దేశ రాజధాని ఢిల్లీలో చనిపోయారు.
ఢిల్లీ ఎస్కార్ట్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 కి అమె కన్ను మూశారు.ఈ ఉదయమే ఆమెను ఆసుపత్రి లో చేర్చారు. అయితే, ఆమెకు తీవ్రమయిన గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆమె మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
షీలా మరణంతో కాంగ్రెస్ ఒక పెద్ద దిక్కు కోల్పోయిందనక తప్పదు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగానే కాదు  భారతీయ రాజకీయాలలో కూడా ఆమె చాలా పాపులర్. 1998 నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు. ఆమెకు చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పేరుంది.
1984, 1989లో ఆమె ఉత్తర ప్రదేశ్ లోని కనౌజ్ నుంచి లోక్ సభ కు ఎన్నిక య్యారు.1986-89మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె మాజీ కేంద్రమంత్రి, పశ్చిమబెంగాల్ గవర్నర్ గా పని చేసిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు.
ఆమె భర్త వినోద్ దీక్షిత్. ఆయన ఐఎఎస్ అధికారి. కుటుంబంతో రైలు ప్రయాణం చేస్తున్నపుడు గుండెపోటు వచ్చి వినోద్ దీక్సిత్ చనిపోయారు. క్రికెటర్ సందీప్ దీక్షిత ఆమె కుమారుడు. ఆయన తూర్పఢిల్లీ నియోజకవర్గం నుంచి 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆమె కూతరు లతికా
సయ్యద్.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీలో కాంగ్రెస్‌ ఓటమిపాలైన తర్వాత 2014 మార్చిలో షీలా కేరళకు గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఐదు నెలలకే ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలాను కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆమె ఆసక్తి చూపలేదు. తిరిగి దిల్లీకి వచ్చిన ఆమె ఈ ఏడాది జనవరిలో దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని నరేంద్రమోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపతెలిపారు.