ఇండియా -వెస్టిండీస్ మ్యాచ్ లో నాటి ముద్దు, నేడు వైరల్

ట్విట్టర్లో #SareeTwitter హ్యాష్ టాగ్ సంచలనం సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే.
ఈ రోజు దీంట్లోకి ఇండియా-వెస్టిండీస్ మధ్య 1975 లో జరిగిన మ్యాచ్ చొరబడింది.
ఈ మ్యాచ్ సెన్సేషన్ ఏమిటో తెలుసా? నిండుగా చీర కట్టుకున్న ఒకమ్మాయి పిచ్ లోకి ఎంటరయి పరిగెత్తు కుంటూ వెళ్లి బ్యాట్స్ మన్ ని ముద్దు పెట్టుకుంది.
ఆ అదృష్టవంతుడెవరనుకుంటున్నారు? 22 సంవత్సరాల బ్రజేష్ పటేల్.
ఒక ట్విట్టర్  ఈ వీడియో క్లిప్ ని Sorry this #SareeTwitter cannot be beaten అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు. ఇది వైరలయ్యింది. శారీవల్ల వైరలయిందా లేక ముద్దుతోనా అనేది చెప్పగలరా?