తిరుమల L1, L2, L3 దర్శనాలు రద్దు, L1,L2,L3 దర్శనాలంటే ఏమిటి?

టిటిడి సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ పౌరులకు న్యూసెన్స్ గా తయారయిన రికమెండేషన్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) రద్దు చేసింది. ఈ విషయాన్ని టిటిడి ఛెయిర్మన్  వైవిసుబ్బారెడ్డి వెల్లడించారు.
చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్స్
*విఐపి దర్శనాలను (ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు) ఈ రోజు నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నాం
*రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం..
*ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తాం
*ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం
L1, L2, L3  దర్శనాలంటే… ఏమిటి?
దేవుడి దగ్గర డబ్బున్నోళ్లకు,పలుకుబడి ఉన్నోళ్లకు మంచి మర్యాదలు లభిస్తాయి. తిరుమలలోనూ ఇది ఉంది. అందులో భాగంగా ఇలాంటి వాళ్లందరిని విఐపి అని ముద్రవేసి వాళ్ల కోసం బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేశారు. అంటే, సాధారణ భక్తుల్లాగా తోసుకుంటూ, వేగంగా దూసుకుంటూపోయి, స్వామి వారిని దర్శించుకునే పద్ధతి కాకుండావాళ్లు తీరుబడిగా దర్శనం చేసుకునే పద్ధతి. ఈ విఐపి దర్శనాన్ని మూడుతరగతులుగా విభజించారు. అవే L1, L2, L3 దర్శనాలు. ఇవి ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు మొదలవుతాయి.
L1 VIP బ్రేక్ దర్శనాలు
ఇవి ప్రభుత్వంలో అత్యున్నత హోదాలో ఉన్నవారికి కేటాయించిన దర్శనాలు. ఇందులోకి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సివిల్ సర్వెంట్లు, రాజకీయ ప్రముఖులు వస్తారు. వీళ్లు వచ్చినపుడు టిడిపి ఛెయిర్మన్ కూడా వీళ్ల వెంట ఉండి దర్శనం చేయిస్తారు. వీళ్ల దర్శనాలకు ఒక గంట కేటాయిస్తారు. విఐపి దర్శనానికి పది నుంచి 15 నిమిషాలుంటుంది. వెంకటేశ్వరస్వామి మూల విరాట్ దగ్గరకు వెళ్లవచ్చు. అక్కడ కొద్ద సేపు గడపవచ్చు. హారతి,తీర్థం ఇస్తారు.లైన్ లో ఇతరు లెవరూ ఉండరు. కాబట్టి తోపులాట ఉండదు.
L1 టికెట్లను బాగా పలుకుబడి ఉన్నవాళ్ల సిఫార్సలేఖలతోనే ఈ టికెట్లు ఇస్తారు. ఆన్ లైన్ బుకింగ్ లేదు. రికమెండేషన్ లెటర్ తీసుకువచ్చి ఇస్తే, దీనినిని అనుమతిస్తే ఫోన్ లో మెసేజ్ పంపిస్తారు. తర్వాత రు. 500 చెల్లించి టికెట్ వసూలు చేసుకోవచ్చు.
L2 VIP బ్రేక్ దర్శనాలు
ఈ దర్శనాలు టిటిడి ఉద్యోగులు, పైన పేర్కొన్న ప్రభుత్వ ప్రముఖులనుంచి రికమెండేషన్ లెటర్లు తెచ్చుకున్న వాళ్లకి లభిస్తాయి. ఈ దర్శనాలకు రోజు 45 నిమిషాలు కేటాయిస్తారు. 20 నుంచి 25 నిమిషాల్లో దర్శనం పూర్తి చేయాలి. వేంకటేశ్వర స్వామి విగ్రహందాకా వీళ్లని అనుమతిస్తారు. హారతి మాత్రమే ఇస్తారు. ఇక్కడ లైన్ నెమ్మదిగా సాగుతుంది. కాకపోతే, తోపులాట ఉండదు.
L3 VIP దర్శనాలు
వీటికి ఆన్ లైన్ బుకింగ్ లేదు. ఎమ్మెల్యే, ఎంపి సిఫార్సు లేఖ ఉంటే చాలా ఈ దర్శనాలు దొరుకుతాయి. లేఖు జెఇవొ ఆఫీసులో ఇస్తే చాలా రు500 టికెట్ ఇస్తారు. ఈదర్శనాలకు 45 నిమిషాలు కేటాయిస్తారు. 30 నిమిషాలలో ఈదర్శనాలు పూర్తి చేసుకోవాలి. మూల విరాట్ దగ్గిరకు అనుమతిస్తారు. L1 L2 లైన్ల కంటే ఈ లైన్ లో చాలా రద్దీ ఉంుటంది.